వరుస తెలుగు చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ వరుస విజయాలను అందుకున్న టాప్ దర్శకుడు సుకుమార్ అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. అంతా తన సినిమాలలోని మార్క్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆయనే దిట్ట.. అయితే ప్రతి ఒక్క దర్శకుడు ఏదోక సినిమాతో  గ్రేట్ అనిపించు కుంటున్నా రు.. అదే సుకుమార్ కూడా అదే విధంగా ఓ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను అందుకున్నారు.. 


టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకడు. ఇటీవల 'రంగస్థలం' సినిమా తో సాలిడ్ సక్సెస్ అందుకున్న సుకుమార్ . ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గతంలో 'రంగస్థలం' సినిమా లో రంగమ్మత్త పాత్రకోసం బుల్లితెర హాట్ యాంకర్ అనసూయను తీసుకున్నాడు సుకుమార్. ఈ సినిమా లో అనసూయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

 

 తాజాగా అల్లు అర్జున్ తో సుకుమార్ చేయబోయే సినిమాలో కూడా అనసూయకు ఛాన్స్ దక్కిందని తెలుస్తుంది. ప్రస్తుతం బన్నీ 'అల వైకుంఠపురంలో' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తన్నాడు. కొద్దిరోజుల్లోనే సుకుమార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు బన్నీ. ఇక ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యం లో సాగనుందని తెలుస్తుంది. బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. 
 


 సరిలేరు  నీకేవరు సినిమా విజయాన్ని  ఎంజాయ్ చేస్తున్న   రష్మిక  బన్నీకి జోడీగా నటిస్తుంది. సుకుమార్ గత చిత్ర రంగస్థలం మాదిరిగానే గ్రామీణ నేపథ్యంలో సినిమా ఉండనుంది. దాంతో ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అనసూయను ఎంచుకున్నాడు సుకుమార్. మరి అనసూయసినిమా ఏ క్యారెక్టర్ లో కనిపిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా కు దేవీ శ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు... త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: