మాస్ మహారాజా రవితేజ తాజా సినిమా 'డిస్కోరాజా'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు. రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోహీరోయిన్లుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'డిస్కోరాజా' సినిమాను సాయి రిషిక సమర్పణలో ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మాంచి జోరుమీద ఉండి సూపర్ సక్సస్ ఫుల్ మ్యూజిక్ ఇస్తున్న తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈనెల 24న 'డిస్కోరాజా' ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.  ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ తో సహా తదితరులు పాల్గొన్నారు.

 

డైరెక్టర్ ఆనంద్ తన మొదటి సినిమా నుంచి నాకు తెలుసు. నా మనసుకు బాగా దగ్గరైన వ్యక్తి. చాలా మంచి డైరెక్టర్. ఈ సినిమాకు టైటిల్ 'డిస్కోరాజా' అని రవితేజ్ ఎనర్జీ కి తగ్గట్టు చాలా బాగా పెట్టాడు. అది రవితేజకు కరెక్ట్‌గా సరిపోతుంది. నిర్మాత రామ్ తాళ్లూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చాలా ప్యాషన్‌గా తీశారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక మా బావ రవితేజ, మాస్ మహారాజా.. తన ఎనర్జీతో ఎవరూ మ్యాచ్ అవ్వలేరు.. అని అన్నారు వి.వి.వినాయక్. ఇలా రవితేజ ని వినాయక్ బావ అనగానే ఆ ప్రాంగణం అంతా ఈలలు చప్పట్లు, అరుపులతో మార్మోగిపోయింది. 

 

ఇక ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని అందుకుని టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని వినాయక్ అన్నారు. డైరెక్టర్ ఆనంద్‌కి ఇది కెరీర్‌లో చాలా పెద్ద సినిమా కావాలని కోరుకున్నారు. ఇక దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతోన్న సినిమాలో వినాయక్ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వినాయక్ ఆ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సీనయ్యగా వినాయక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్దమవుతున్నారు. ఈ సినిమాలో వినాయక్ మెకానిక్ గా నటిస్తున్నారని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: