ఇటీవల వరుసగా కెరీర్ పరంగా పరాజయాలు చవిచూస్తున్న మాస్ మహారాజ రవితేజ, ప్రస్తుతం డిస్కో రాజా, క్రాక్ అనే సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. కాగా వాటిలో డిస్కో రాజా సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన అయితే లభించింది. ఇక నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా యూనిట్ మొత్తం కూడా సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని, హీరో రవితేజ, దర్శకుడు విఐ ఆనంద్ పడ్డ శ్రమ రేపు థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడికి బాగా నచ్చుతుందని చెప్పడం జరిగింది. 

 

అయితే డిస్కో రాజా విషయమై ఆ సినిమా యూనిట్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మ్యాటర్ ఏంటంటే, ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్స్ అయిన నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్ వంటి సంస్థలకు తమ సినిమా డిజిటల్ హక్కులను అమ్మడం జరుగలేదని, కావున ప్రేక్షకులు సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి అంటూ నిన్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. వాస్తవానికి బన్నీ, త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమా నిర్మాతలు కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. అయితే ఈ విధంగా చేయడం వలన, సినిమా మరిన్ని ఎక్కువ రోజులపాటి థియేటర్స్ లో కొనసాగడం, అలానే సినిమాను ఎంతో ధరపోసి కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు మేలు జరగడం జరుగుతుందని అంటున్నారు. 

 

ఇటీవల కొన్నాళ్లుగా నిర్మాతలు తమ సినిమాలను ఓటిటి ప్లాట్ ఫామ్స్ సంస్థలకు అమ్మడం వలన, నెలరోజుల తరువాత కొత్త సినిమాలను వాటిలో చూడొచ్చు అనే భావన కొందరు ప్రేక్షకుల్లో కలుగుతోందని, ఆ భావనకు చెక్ పెట్టేందుకే బన్నీ, రవితేజ సినిమాల నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయం అని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒకరంగా కొందరు ఆడియన్స్ కు షాక్ ఇచ్చినప్పటికీ, కొంత ఆలస్యం అయినా సరే థియేటర్స్ లో సినిమా ఎంజాయ్ చేయాలనుకునే వారికి మాత్రం బాగా మేలు చేస్తుందని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: