కమెడియన్ అలీ భార్య జుబేదా ఎప్పుడు మీడియా ముందుకు రాదు. అయితే అలీతో ఆమెకు పెళ్ళి జరిగి 26 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియని అనేక విషయాలను ఆమె షేర్ చేసింది. 

తన భర్త అలీ గతంలో కొందరి హీరోయిన్స్ గురించి చేసిన కామెంట్స్ పై మీడియాలో వచ్చిన నెగిటివ్ స్పందన పై స్పందిస్తూ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు అందర్నీ నవ్వించడానికి అలీ అలా సరదాగా కామెంట్స్ చేస్తాడు కాని అతడి మనసులో ఎటువంటి దురుద్దేశ్యం లేదు ‘మాయన బంగారం’ అని అంటోంది. అయితే చంద్రుడుకి ఒక మచ్చలా అలీ కామెంట్స్ పై జరిగిన రగడ తనను ఎంతో బాథ పెట్టింది అంటూ తన భర్తను తప్పుగా అర్ధం చేసుకుని నవ్వులపాలు చేయవద్దు అంటూ ఆమె మీడియాకు అభ్యర్ధనలు చేస్తోంది. 

అంతేకాదు భర్త అంటే అలీ లా ఉండాలని తాను చాల గర్వంగా చెప్పగలను అని చెపుతూ తన తమ్ముళ్ళు అలీని బావ లా కంటే నాన్న లా చూస్తారు అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు అలీ తన తోడపుట్టిన వాళ్ళను ఎలా చూసుకుంటాడో తన సోదరులను కూడ అలాగే చూసుకుంటాడని చెపుతూ అలీ మంచితనం గురించి చాల కొద్దిమందికి మాత్రమే తెలుసు అని కామెంట్స్ చేసింది.

ఇదే సందర్భంలో గతంలో ఒక పత్రిక అలీకి నటి శుభశ్రీ కి పెళ్ళి అయిపోయింది అని అప్పట్లో వచ్చిన ఒక వార్తను చదివి తాను ఖంగారు పడిన విషయాన్ని బయటపెడుతూ ఆరోజు తన జీవితం అయిపోయింది అని భయపడిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ చివరికి నిజం తెలుసుకుని తాను కుదుటపడిన విషయాలను వివరించింది. నటుడుగా పేరు డబ్బు అన్నీ సంపాదించినా ఇప్పటికీ ఎటువంటి గర్వం అలీలో కనిపించదు అని చెపుతూ ప్రతి సంవత్సరం రంజాన్ రోజున మూడు లక్షల రూపాయల డబ్బును పేదలకు అలీ ఉచితంగా పంచి పెడతాడు అన్న విషయం చాల కొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయం అని జుబేదా అంటోంది..     

మరింత సమాచారం తెలుసుకోండి: