తన స్టయిల్ తో,డ్యాన్స్ తో ఇలా ఒక్కటేమిటి అన్నీ చేయడంలో బన్నీ కి సాటి ఎవరు లేరు..  సినిమాల పరంగా వ్యక్తిత్వం పరంగా బన్నీ స్టయిల్ వేరు అనే చెప్పాలి.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ద్వారా దాదాపుగా రెండేళ్లు గ్యాప్ తీసుకున్న బన్నీ  ఇప్పుడు త్రివిక్రమ్ కాంబినేన్లో ఓ సినిమా చేశాడు.. ఆ సినిమానే అల వైకుంఠపురం లో...

 

పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రం జనవరి 12న విడుదలయి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. సినిమాను పెయింటింగ్‌తో పోలుస్తూ అద్భుతంగా వర్ణించారు అల్లు అర్జున్. ‘‘సినిమాను ఒక పెయింటింగ్ అనుకుంటే దానికి కాన్వాస్ లాంటి వ్యక్తి హీరో అవ్వచ్చు. ఆ కాన్వాస్‌ను స్ట్రాంగ్‌గా పట్టుకుని నిలబెట్టే ఫ్రేమ్ ప్రొడ్యూసర్ కావొచ్చు. 

 

బన్నీ మాట్లాడుతూ..పెయింటింగ్ కు  వాడే బ్రషెస్ టెక్నీషియన్స్ అవ్వొచ్చు. ఆ పెయింటింగ్ మీద మంచి రంగులు ఆర్టిస్టులు కావచ్చు. కానీ, ఈ మొత్తం పెయింటింగ్‌ని ఊహించి ఒంటి చేత్తో గీసి దానికొక రూపం తీసుకొచ్చే ఆర్టిస్టే డైరెక్టర్’’ అని గొప్పగా చెప్పారు బన్నీ. అలాంటి త్రివిక్రమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నారు.

 

సినిమా విషయానికొస్తే..సినిమా చాలా పెద్ద స్థాయిలో వెళ్తోంది. ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రికార్డ్ సినిమాలా నిలబడబోతోంది. ‘హలో బ్రదర్’, ‘గీతాంజలి’, ‘గ్యాంగ్ లీడర్’, ‘శంకరాభరణం’ లాంటి గొప్ప సినిమాలు చూస్తే ఆ రోజుకి అవి వసూలు చేసిన డబ్బు ఒక కోటి ఉంటుందేమో. ‘గీతాంజలి’ సినిమా మొత్తంగా రూ.2 కోట్లు వసూలు చేసుంటుందేమో. కానీ, ఒక సినిమా చూసినప్పుడు కలిగే గొప్ప ఫీలింగ్ ఎప్పటికీ శాశ్వతం. ఈరోజు నా సినిమా రికార్డులు సృష్టిస్తోంది. కానీ, ఈ రికార్డులు తాత్కాలికం. అంటూ బన్నీ అన్నారు..ఇప్పుడు బన్నీ సుకుమార్ సినిమా లో నటిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: