ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు అంతా అమరావతిలో ఈ ఉదయం సమావేశం కాబోతున్న శాసన సభ వైపు చూస్తోంది. పాలన వికేంద్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల అడుగులు వేస్తున్న నేపధ్యంలో ఈరోజు ఎలాంటి కీలక ప్రకటన ఉండబోతోంది అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో బాలకృష్ణ నిన్న అమరావతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ టిడిఎల్ఫీ సమావేశానికి బాలయ్య ఎవరు ఊహించని గెటప్ లో వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. పూర్తిగా ‘గుండు’ లుక్ తో బాలయ్య మారిపోవడమే కాకుండా తన మీసాలకు మాత్రం నల్ల రంగు వేసుకుని ఈరోజు జరగబోతున్న పరిణామాలతో అమరావతి ప్రాంత రైతులకు కేవలం గుండు మాత్రమే మిగిలింది అన్న సంకేతాలు ఇచ్చాడు. 

దీనితో బాలయ్య గుండు లుక్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. త్వరలో బాలకృష్ణ బోయపాటిల మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతున్న పరిస్థితులలో ఆ మూవీలో ఇలాంటి లుక్ లో బాలయ్య కనిపిస్తాడా అన్న సందేహం చాలామందికి కలుగుతోంది. ప్యూర్ వైట్ డ్రెస్ లో తెల్లని గడ్డంలో చూడటానికి బాలయ్య శివాజీ సినిమాలో రజినీకాంత్ గుండు లుక్ బాలయ్య గుండు లుక్ ను పోలి ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

ఒకసారి పాత్రలోకి దిగాడు అంటే బాలయ్య ఎలాగైనా మారిపోతాడు. ఈమధ్యనే విడుదలైన ‘రూలర్’ మూవీ కోసం ఫ్రెంచ్ గడ్డంతో వెరైటీగా కనిపించిన బాలయ్య ఇప్పుడు బోయపాటి సినిమా కోసం ఇలా మారిపోయాడు అనుకోవాలి. వాస్తవానికి బాలయ్యకు తల పై పూర్తిగా జుట్టు తగ్గిన నాటి నుండి అసెంబ్లీ సమావేశాలకు కూడ బాలయ్య విగ్ లేకుండా బయటకు రావడంలేదు. అయితే తన తీరుకు భిన్నంగా ఇప్పుడు బాలయ్య గుండు కొట్టించు కోవడం దేనికి సంకేతం అంటూ చాలామంది జోక్స్ వేస్తున్నారు. అమరావతిలో బాష్పవాయు గోళాలు జల ఫిరంగులు సిద్ధం చేసిన పరిస్థితులలో యుద్ధ వాతావరణంలో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బాలయ్య వ్యూహం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: