టాలీవుడ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి తెలియంది కాదు. మాస్ ఆడియన్స్ ఎన్టీఆర్ కు బాగా కనెక్ట్ అవుతారు. ఆయన నటన, డ్యాన్సులు, డైలాగ్ డెలివరీ.. ఇవన్నీ ఆయన అభిమానులనే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా అలరిస్తూ ఉంటాయి. ఆయన చేసే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆతృతలో అభిమానులు ఉంటారు. ఆయన చేస్తున్న, చేయబోయే సినిమాలపై ఫోకస్ పెడతారు. అలాంటిది ఆయన సినిమా ఓ ఏడాది లేదంటే.. మొత్తంగా రెండేళ్లు సినిమా రాకుండా ఉండటమంటే సామాన్యమైన విషయం కాదు.

 

 

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత.. 2018లో దసరా పండగకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ మళ్లీ ఆయన నుంచి సినిమా రాలేదు. 2019లో సినిమా లేదు. రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు. సహజంగా రాజమౌళి సినిమా అంటే సంవత్సరాలు కాల్షీట్లు కేటాయించాల్సిందే. దీంతో ఎన్టీఆర్ పూర్తిగా రాజమౌళికి అంకితమైపోయాడు. అయితే ఈ సినిమా ఈ ఏడాది జూలై 30న విడుదలవుతుందని ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడా సినిమా వాయిదా పడబోతోందని వార్తలు వస్తున్నాయి. దసరాకు విడుదల కావొచ్చని సమాచారం.

 

 

ఇదే నిజమైతే ఎన్టీఆర్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లు అయినట్టే. స్టార్ హీరో సినిమా రెండేళ్లు లేదంటే పరిశ్రమకు మంచిది కాదు. పైగా మంచి డిమాండ్ ఉన్న హీరో. ఆర్ఆర్ఆర్ తర్వాతైనా ఎన్టీఆర్ తన సినిమాల్లో వేగం పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాహుబలికి ప్రభాస్ కూడా దాదాపు నాలుగేళ్లు కేటాయించాడు. రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ వల్ల ఏడాదిన్నరకు పైగా మరో సినిమా లేకుండా పని చేస్తున్నట్టే. ఇలా రాజమౌళి తన హీరోల నుంచి ఎక్కువ మొత్తం కాల్షీట్లు తీసుకోవడం సాధారణ విషయమైపోయిందనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: