రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఎలాంటి విషయం బయటకి రానప్పటికీ, ఈ సినిమా చిత్రీకరణ గురించి ఎప్పుడూ ఏదో ఒక సమాచారం అందుతూనే ఉంది. ఈ మధ్యే విశాఖ ఏజన్సీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం మరో షెడ్యూల్ కి రెడీ అవబోతుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు ఎన్నో ఉన్నాయి.

 

 

ఈ సినిమాలో నటీనటుల గురించి ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రతి నాయకులుగా హాలీవుడ్ నటీనటుఅలని తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ స్నేహితుడిగా రాహుల్ రామక్రిష్ణ నటిస్తున్నాడన్న విషయం కూడా తెలిసిందే. తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ సుదీప్ కూడా చేయబోతున్నట్లు ఆ వార్త సమాచారం.

 

 

అయితే గతంలో  రాజమౌళి తీసిన 'ఈగ'లో విలన్‌గా అదరగొట్టి.. ఆ తర్వాత 'బాహుబలి'లోనూ ఓ పాత్ర చేశాడు. అలాంటిదే ఆర్.ఆర్.ఆర్ లోనూ ఒక పాత్రలోనూ కనిపిస్తాడనే వార్త జోరందుకుంది. అయితే దీనిపై కిచ్చా సుదీప్ వివరణ ఇచ్చాడు. "ఆర్ఆర్ఆర్‌లో నేను నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. ఇప్పటివరకు ఆ చిత్ర బృందం నుంచి నన్ను ఎవరూ సంప్రదించలేదు" అని సుదీప్ స్పష్టం చేశాడు. దీంతో ఈ ప్రచారానికి తెరపడిపోయింది.

 

 

ఆర్ఆర్ఆర్'లో సుదీప్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం జనాల్లో ఉంది. మరి ఏమీ లేకుండా అతనీ సినిమాలో నటించేస్తున్నట్లు అంతగా ప్రచారం ఎలా జరిగిందో..? మరి సుదీప్ నటిస్తే బాగుంటుందని కోరుకుంటున్న వారికోసమయినా రాజమౌళి ఆయన చేత ఏదైనా పాత్ర చేయిస్తారేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: