అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ము దులుపుతుంది. సినిమా విడుదలై వారం రోజులు కావొస్తున్నా సినిమాకి వస్తున్న స్పందన మాత్రం తగ్గట్లేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజైన ఒకరోజు తర్వాత రిలీజ్ అయిన ఈ చిత్రం ఆ చిత్రాన్ని దాటుకుని దూసుకుపోతుంది. అటు కలెక్షన్ల పరంగా బాక్సాఫీసును కొల్లగొడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవర్సీస్ లోనూ స్ట్రాంగ్ గా నిలబడింది.

 

 

ఇది ఇలాగే కొనసాగితే నాన్ బాహుబలి రికార్డు బద్దలవ్వడం ఖాయం అనిపిస్తోంది. అయితే ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాట ఉన్న సంగతి తెలిసిందే. సిత్తరాల సిరపడు అనే పాట అప్పటి వరకు ఆడియోలో పెట్టకుండా ఒక్కసారిగా సినిమా చూసిన వారందరికీ షాక్ కలిగేలా చేశారు. అయితే ఈ పాటని దాచిపెట్టడానికి వారు చాలా కష్టపెట్టాల్సి వచ్చిందట.  ఈ సినిమాలో ని పాటలన్నీ సూపర్ హిట్టే.

 

 

అందుకే సినిమా విడుదలకి ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని కాకుండా మ్యూజికల్ కన్సర్ట్ అనే పేరుతో ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో గేయ రచయితల్ని అందరూ కొనియాడారు. అయితే సిత్తరాల సిరపడు అనే పాట రాసిన విజయ్ కుమార్ ని  మాత్రం స్టేజి మీదకి పిలవలేదు.  అసలు సినిమాలో ఆ పాట ఉందన్న సంగతి కూడా జనాలకు అప్పటికి తెలియలేదు. స్టేజి మీదకి పిలవకపోవడం, ఆడియోలో ఆ పాట లేకపోవడంతో అసలు ఆ పాట సినిమాలో ఉంటుందా.. ఉండదా అన్న అనుమానం కలిగిందట రచయితకి..

 

 

కాని సినిమా చూశాక అందరూ ఆ పాటని ఆదరిస్తుంటే, తనకి చాలా బాగుందట.. పాటని దాచిపెట్టాలనే ఉద్దేశ్యంతోనే అతన్ని స్టేజి మీదకి పిలవలేదని అర్థం చేసుకున్నాడట.. మొత్తానికి పాట హిట్ అవడం తనకి చాలా ఆనందాన్ని కలిగించిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: