దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సినిమా కథ కథాంశం ఎలా ఉన్నప్పటికీ తనదైన పంచ్ డైలాగ్లతో సినిమా మొత్తం ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కిస్తున్నారు. అందుకే త్రివిక్రమ్ సినిమా వస్తుందంటే ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ అని ప్రేక్షకులు నమ్ముతుంటారు. సినిమా తీయడానికి పేజీలకు పేజీలు డైలాగులు అవసరం లేదు... సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి మదికి తాకే రెండు మూడు డైలాగులు ఉన్న సరిపోతుంది అని నిరూపించారు త్రివిక్రమ్. మాటలతో మాయ చేసి... డైలాగ్ లతో హోరెత్తించటం  త్రివిక్రమ్ కే సొంతం. తాజాగా త్రివిక్రమ్ తన  సూపర్ హిట్ కాంబినేషన్ అయినా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తో మూడో సారి అలా వైకుంఠపురములో  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.

 

 

 ఈ సినిమా ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. వసూళ్ళ పరంగా కూడా ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది అలా వైకుంఠపురములో సినిమా. దీంతో చిత్ర బృందం ఆనందంలో మునిగి పోయింది. అలా వైకుంఠపురములో సక్సెస్ మీట్ ను నిన్న విశాఖ వేదికగా నిర్వహించారు. సక్సెస్ మీట్ లో ప్రసంగించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విశాఖపట్నం పేరు  చెప్పగానే తనకు ఏం గుర్తు వస్తుందో చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం పేరు చెప్పగానే తనకు ఇక్కడ ఉండే అద్భుతమైన బీర్ తో పాటు ఆంధ్ర యూనివర్సిటీ అందమైన అమ్మాయిలు గుర్తుకు వస్తారు అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఇక విశాఖలో అందమైన అమ్మాయిలు చాలామంది ఉంటారు అని అనగానే బన్నీ  అభిమానులు కార్యక్రమానికి వచ్చిన వారందరు  కేరింతలు పెట్టారు. 

 

 

 వైజాగ్ లో ఉండే బీచ్  తనకు ఎంతో ఇష్టమని ఇక్కడే శ్రీశ్రీ గారు తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుర్తు చేశారు. చలం,  రవిశాస్త్రి,  సీతారామ శాస్త్రి వంటి ఎందరో మహానుభావులను ఈ విశాఖపట్నం అందించిందని త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. ఎన్నో మలుపులు ఉన్న మహా నగరం విశాఖ అని... ఈ నగరానికి ఈ తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రసంగించారు. తాను  చిన్నప్పుడు విశాఖపట్నంలో నే  చదువుకున్నానని  ఆనాటి జ్ఞాపకాలు తన మనసులో పదిలంగానే ఉన్నాయి అంటూ గుర్తు చేసుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్. తన భవిష్యత్తుకు బాటలు వేసిన విశాఖపట్టణానికి ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: