‘మహర్షి’ మూవీలో ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించిన అల్లరి నరేశ్ కు ఆ మూవీ విడుదల తరువాత అతిథి పాత్రలలో అన్న పెదనాన్న మావయ్య పాత్రలలో నటించడానికి అనేక భారీ ఆఫర్లు వచ్చాయి. అంతేకాదు ప్రస్తుతం ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇస్తున్న విధంగా భారీ పారితోషికాలు ఇస్తాము అని దర్శక నిర్మాతలు ఆఫర్ చేసినా నరేశ్ ఆ ఆఫర్లను పూర్తిగా తిరస్కరించాడు. 

దీనితో నరేశ్ తప్పు చేస్తున్నాడా అంటూ కామెంట్స్ కూడ వచ్చాయి. అయితే తన పై వస్తున్న విమర్శలకు నరేశ్ ఈరోజు సరైన సమాధానం ఇచ్చాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఏహీరో చేయని సాహసం చేస్తూ నరేశ్ నగ్నంగా ఒక మూవీలో కనిపించబోతున్నాడు. 

అల్లరోడు హీరోగా ‘నాంది’ అనే టైటిల్ తో ఒక మూవీ ప్రారంభం కాబోతోంది. ఈ మూవీకి సంబధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేసారు. ఒక పోలీసు స్టేషన్ లో అల్లరి నరేశ్ ను బట్టలు ఊడతీసి తల క్రిందులుగా వెళ్ళాడ తీస్తూ టార్చర్ పెడుతున్న సీన్ కు సంబంధించిన లుక్ ఇది. 

కనమేడల విజయ్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సతీష్ వేగేశ్న నిర్మాత. ఈ మూవీని చాల వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది జూన్ లోపు సమ్మర్ సీజన్ లో విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సమ్మర్ రేస్ లో వచ్చే వెరైటీ సినిమాలకు ఆదరణ బాగా ఉండే నేపద్యంలో నరేశ్ వ్యూహాత్మకంగా ఈ కొత్త సబ్జెక్ట్ తో వెరైటీ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రేక్షకులు అభిరుచి మారిపోయిన నేటి పరిస్థితులలో ఈ మూవీ సక్సస్ అయితే మళ్ళీ నరేశ్ ట్రాక్ లోకి రాగలుగుతాడు. ‘పికె’ మూవీ కోసం బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ నగ్నంగా కనిపించి సంచలనాలు క్రియేట్ చేసాడు. ఇప్పుడు నరేశ్ ఏమి చేస్తాడో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: