బాలయ్య బాబు నటించిన రూలర్ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలయ్య కి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రధానంగా అందరికీ నచ్చని అంశం ఒకటుంది. అదే బాలయ్య గెటప్. ఈ సినిమాలో రెండు ప్రధాన పాత్రల్లో కనిపించాడు. ఒక పాత్రలో టోనీ స్టార్క్ గా కనిపిస్తే మరో పాత్రలో పోలీస్ ఆఫీసరుగా కనిపించాడూ.

 

 

అయిఏ పోలీస్ ఆఫీసరు పాత్రలో ఉన్న బాలయ్య లుక్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ గెటప్ ఎవరికీ నచ్చలేదు. సినిమా కథ పాతదే అయినా లుక్ కూడా బాలేకపోవడంతో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం బాలయ్య బోయపాటితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలోనైనా బాలయ్య లుక్ బాగుంటుందని ఆశిస్తున్నారు. అయితే వాళ్ళు ఆశించినట్టుగానే లుక్ బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది.

 

 

అయితే తాజాగా బాలయ్య లుక్ ఒకటి బయటకి వచ్చింది. ఈ  నయా లుక్ ఆయన అభిమానులతో పాటు సగటు సినీ ప్రేమికులలో ఆసక్తి పెంచింది. ఎన్నడూ కనిపించని కొత్త లుక్ లో ఆయన దర్శనమిచ్చారు. వైట్ అండ్ వైట్ లో విగ్గు లేకుండా తెల్లని గడ్డంలో ఉన్న బాలయ్య లుక్ ఆకట్టుకుంటుంది. ఐతే ఈ లుక్ వెనుక కారణం ఏమిటన్నది అర్థం కాలేదు. కాగా ఈ లేటెస్ట్ లుక్ బోయపాటి సినిమా కోసమా… అనిపిస్తుంది.

 

అభిమానుల నుండి వచ్చే స్పందన తెలుసుకోవడానికి ఇలా ఆయన లుక్ బయటకు విడుదల చేశారా అనే అనుమానం కూడా కలుగుతుంది. లేక షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ లో బాలయ్య ఇలా క్యాజువల్ లుక్ లో కనిపించారా అనేది తెలియాలి. కాకపోతే ఈ లుక్ మాత్రం చాలా బాగుందనే టాక్ వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: