తెలుగమ్మాయి ఈషా రెభ్భాకి అదృష్టం బాగానే ఉంది. అందం అభినయం రెండూ కలగలిసిన ఈ అమ్మడుకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. స్టార్ హీరో సినిమాల్లో నటించే అవకాశం రాకపోయినా ఆమె కి సినిమాలకి మాత్రం కొదవలేదు. అయితే అటు అవకాశాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఆమె హవా నడుస్తుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుని రెచ్చ గొడుతోంది. అయితే ఈ అమ్మడుకి ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని సమాచారం.

 

 

అందమే కాకుండా ఆమె మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. పరిశ్రమలో మీటూ వ్యవహారాలపై సూటిగా మాట్లాడే తెగువ ఇషా రెబ్బాకు ఉందని  తన కామెంట్ల ద్వారా అర్థం అవుతోంది. సూటిగా ఏదైనా మాట్లాడేస్తే.. ముఖం చాటేసే పరిశ్రమలో ఈషా డేర్ కి ప్రశంసలు దక్కాయి. అయితే ఇలాంటి డేర్ చూపిస్తే తనకు మరో అవకాశం వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్ ఆమె తలుపు తట్టింది.

 

 

బాలీవుడ్ నుంచి ఈషాకు అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. అనీల్ కపూర్ వారసుడు హర్షవర్ధన్ కపూర్ సరసన సోషల్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలో ఆఫర్ అందుకుంది. బాలీవుడ్ ఫిలింమేకర్ రాజ్ సింగ్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈషా ఈ చిత్రంలో రాజస్థానీ అమ్మాయిగా కనిపించనుంది. మహిళా సాధికారతను.. స్త్రీ శక్తిని ఎలివేట్ చేసే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. 

 

 

ఇదే గాక అటు తమిళంలోనూ అవకాశం దక్కించుకుంది. అటు కన్నడ పరిశ్రమలోనూ మరో అవకాశం చేజిక్కించుకుంది. తెలుగమ్మాయిగా గుర్తింఔ తెచ్చుకున్న ఈ అమ్మడుకి బాలీవుడ్ ఆఫర్ తర్వాత అయినా తెలుగులో స్టార్ హీరోలతో నటించే అవకాశం వస్తుందేమో చూడాలి. తెలుగమ్మాయిలకి అవకాశాలు రావు అనే వారికి ఈషా రెబ్బా ఒక ఆదర్శంగా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: