టాలీవుడ్ లో కెరీర్ బిగినింగ్ లో యాక్షన్ తరహా సినిమాల్లో నటించి తర్వాత ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్స్ తో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు విక్టరీ వెంకటేశ్.  తనదైన మానరీజం.. థియేటర్లో అన్ని వర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం వెంకటేష్ కే చెల్లింది.  హీరోయిజంతో పాటు కామెడీ పండించి అందరి మనసు దోచారు వెంకటేష్.  గత కొంత కాలంగా సోలో హీరో కన్నా మల్టీస్టారర్ మూవీస్ లోనే ఎక్కువగా నటిస్తున్నారు వెంకటేష్.  ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాన్, రామ్, వరుణ్ తేజ్ గత ఏడాది తన మేనళ్లుడు నాగ చైతన్య తో కలిసి వెంకిమామ మూవీలో నటించారు.  అంతే కాదు రీమెక్ సినిమాలంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వెంకటేష్ తాాజాగా తమిళనాట సూపర్ హిట్ అయిన అసురన్ రిమేక్ పనిలో ఉన్నారు.

 

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ఈ మూవీ అక్కడ రూ.150 కోట్ల క్లబ్ లో చేరింది. ‘అసురన్’ సామాజిక అసమానతల్ని స్పృశిస్తూ ప్రతీకార కథాంశంతో దర్శకుడు వెట్రిమారన్‌ ఈ సినిమాను రూపొందించారు. ధనుష్‌ పాత్రను తెలుగులో వెంకటేష్‌ పోషించనున్నారు. అయితే ఈ మూవీ రాయలసీమ ఫ్యాక్షన్ తరహా ఉండబోతుందట.  చాలా కాలం తర్వాత ఓ ఫ్యాక్షన్ తరహా పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నారు. గతంలో జయం మనదేరా మూవీలో ఆ తరహా పాత్రలో కనిపించారు. 

 

అసురన్‌' రీమేక్‌ కోసమే ఈ కొత్త లుక్‌లోకి ఆయన మారిపోయినట్లు చెబుతున్నారు. ప్రియమణి ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నది. సురేష్‌బాబు, కలైపులిథాను ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ నెల 22 నుంచి రాయలసీమలో రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.  చాలా కాలం తర్వాత వెంకటేష్ కొత్త లుక్ తో కనిపిచండం.. గతంలో వెంకటేష్ ‘గురు’ మూవీలో కొత్త తరహా లో కనిపించన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: