ఈవారం విడుదల కాబోతున్న ‘డిస్కో రాజా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఉత్సాహ భరితంగా జరిగింది. ఈ ఈవెంట్ కు వచ్చిన వినాయక్ రవితేజా గురించి మాట్లాడుతూ ఒకసారి రవితేజా తన ఎనర్జీని బయటకు వదలడం మొదలు పెడితే అతడి ముందు చాలమంది హీరోలు సరిపోరు అంటూ కామెంట్ చేసాడు. 

అంతేకాదు ఈ మూవీ దర్శకుడు ఆనంద్ తనకు చాల దగ్గర వ్యక్తి అని చెపుతూ మాస్ మహారాజాకు సరిపోయే స్క్రిప్ట్ ను టైటిల్ ను ఎంచుకున్న ఆనంద్ అంచనాలు ఈసినిమా విషయంలో తప్పవు అని అభిప్రాయపడ్డాడు. ఈ ఈవెంట్ లో తన ఉపన్యాసాన్ని ముగించబోతున్న వినాయక్ దగ్గరకు సుమ ఒక జోక్ వేసి వినాయక్ ను కెలికింది. 

వినాయక్ హీరోగా నటిస్తున్న ‘శీనయ్య’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడు అని అడుగుతూ ఆ ఫంక్షన్ కు తనను యాంకర్ గా పిలుస్తారా లేదా అంటూ జోక్ చేసింది. ఈ మాటలకు షాక్ అయిన వినాయక్ వెంటనే రివర్స్ పంచ్ వేస్తూ గుడికి వెళ్ళి దణ్ణం పెట్టుకోవాలి అంటే పూజారి సినిమా ఫంక్షన్స్ జరగాలి అంటే సుమ లేకుండా జరిగే వ్యవహారం కాదు కదా అంటూ సుమ మైండ్ బ్లాక్ చేసి తన చేతిలోని మైక్ సుమ చేతికి ఇచ్చి నవ్వుకుంటూ కిందకు దిగి వెళ్ళిపోయాడు. 

వాస్తవానికి సంక్రాంతి రేస్ సినిమాల హడావిడి వల్ల ఈ నెలలో సగటు ప్రేక్షకుడు తన శక్తికి మించి చాల సినిమాలే చూసాడు. ఇలాంటి పరిస్థితులలో ‘డిస్కో రాజా’ ధియేటర్ల వైపు సగటు ప్రేక్షకుడు రావాలి అంటే ఆ మూవీకి టోటల్ పాజిటివ్ టాక్ వచ్చితీరాలి. లేదంటే ఒక నెలరోజులు ఓపిక పడితే అమెజాన్ లో ఈ మూవీ వచ్చేస్తుంది కదా అన్న అభిప్రాయం కలిగితే మాస్ మహారాజా కు ఈసారి కూడ మరో పరాభవం వచ్చే ఆస్కారం ఉంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: