సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , డ్యాషింగ్  డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఫైటర్.  ఈ కాంబినేషన్ పై  ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి.  ఈచిత్రం యొక్క షూటింగ్ ఈ రోజు ముంబై లో ప్రారంభమైంది. ఈ సినిమాలో విజయ్  కు జోడిగా  అనన్య పాండే కనిపించనుంది.  మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఛార్మి , పూరి కలిసి నిర్మిస్తున్నారు. ఈఏడాది సమ్మర్ లో  ఈ చిత్రం విడుదలకానుంది.  తెలుగు తోపాటు హిందీ లో కూడా  ఈచిత్రాన్ని విడుదల చేయడానికి  ప్లాన్ చేస్తున్నారు.  
 
ఇక  వరస పరాజయాల తరువాత పూరి జగన్నాథ్  ఎట్టకేలకు  గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ గా కం బ్యాక్ కాగా టాక్సీ వాలా  తరువాత మంచి అంచనాల మధ్య  విడుదలైన డియర్ కామ్రేడ్  విజయ్కి షాక్ ఇచ్చింది.  ఈ సినిమా తరువాత  విజయ్ , మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్  క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో వరల్డ్ ఫేమస్ లవర్  అనే చిత్రంలో నటించాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నఈ చిత్రంలో  విజయ్ సరసన  ఐశ్వర్య రాజేష్, ఇజా బెల్లె, కేథరిన్ థ్రెసా మరియు రాశి ఖన్నా  నటించారు. 
 
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్  దశలో వుంది.  ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క  టీజర్ మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.  సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా  గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకరానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: