అల వైకుంఠపురములో ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం ఆరు రోజుల్లోనే 104 కోట్ల షేర్‌ సాధించి మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు బన్నీ. ఈ సందర్భంగా చిత్రయూనిట్ వైజాగ్‌లో విజయోత్సవ సభను నిర్వహించారు. ఘనంగా జరిగిన ఈ వేడుకలో ఆసక్తికర సంఘటనలు చోటు చేసేకున్నాయి. అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో.  సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్ టాక్ దూసుకుపోతోంది. ఈ సినిమా మంచి వసూళ్లు సాధించటంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌, రాధకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు.

 

అల్లు అర్జున్‌ ని ఎలాంటి మ్యూజిక్ కావాలి బ్రదర్ అని తమన్ అడిగాడట. అప్పుడు బన్ని వన్ బిలియన్ వచ్చే ఆల్బమ్ కావాలని చెప్పాడట. నిజంగా అలాంటి ఆల్బమే ఇచ్చాడు. మాట నిలబెట్టుకున్నందుకు తమన్‌కు కృతజ్ఞతలు. ‘సామజవరగమన’ పాటతో సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనిపించుకున్నాడు. ఇది నేను చెప్పే మాట కాదు.. ఆడియో కంపెనీ, ప్రపంచమంతా తనకిచ్చే బిరుదు. అలాగే, ‘రాములో రాములా’తో చాట్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ అనిపించుకున్నాడు. ఒక ఆల్బమ్ నుంచి రెండు మంచి పాటలు రావడమే కష్టం. కానీ, ఆ తరవాత కూడా మంచి పాటలు ఇచ్చి ఆల్బమ్ ఆఫ్ ది డెకేడ్ అనిపించుకున్నాడు’ అంటూ వేదిక మీద ఉన్న అందరి ముందు తమన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు బన్నీ. 

 

ఇక దర్శకుడు త్రివిక్రమ్.. ఈ సినిమాను తన భుజం మీద మోసుకుంటూ జనం ముందుకు తీసుకువచ్చినటువంటి తమన్‌ ఎలాంటి సంగీతాన్ని అందించాడంటే, మనం కాలు కదపకుండా ఉండలేనంత, మన గుండెల్లోకి వచ్చేసి మీరు ఈ సినిమాకు వస్తారా రారా.. టికెట్ కొంటారా కొనరా అని ఇబ్బంది పెట్టేంత మంచి సంగీతాన్ని అందించాడు. తమన్‌ కారణంగానే ఇంత ఆదరణ ఇన్ని కలెక్షన్స్‌, ఇంత అభిమానం తీసుకొచ్చారు ... అంటూ తమన్‌ను ఆకాశానికి ఎత్తేశాడు త్రివిక్రమ్‌. వేదిక మీద త్రివిక్రమ్ తన గురించి మాట్లాడుతున్నంత సేపు తమన్‌ భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నాడు. ఇది తమన్ జీవితంలో మరిచిపోని రోజుగా గుర్తుండిపోతుందని తమన్ ఈ సందర్భంగా అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: