ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మంది నెటిజన్స్ సోషల్ మీడియాను నానా అడ్డమైన పనులకు ఉపయోగిస్తూ నాశనం చేస్తున్నారు. ఏం చేసినా మమ్మలిని అనేవాళ్ళు లేరు అనుకుంటూ సౌత్ నార్త్ లో ఉన్న హీరోల హీరోయిన్లపై ఇష్ఠమొచ్చినట్టుగా పిచ్చి పిచ్చి కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఇలాంటి కామెంట్స్ హీరోయిన్సే ఎదుర్కుంటూ ఉంటారు. తాజాగా దర్శకేంద్రుడు తెరకెక్కించిన ‘అన్నమయ్య’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన కస్తూరికి ఓ నెటిజన్ నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైందని తాజా సమాచారం. తమిళ సూపర్‌స్టార్ అజిత్ అభిమాని అయిన ఆ నెటిజన్.. కస్తూరిని టార్గెట్ చేస్తూ పిచ్చి కామెంట్స్ చేశాడు. అతను ఈ కామెంట్స్ చేసింది జనవరి 12న అయితే కస్తూరి తనపై చేసిన తప్పుడు కామెంట్స్‌ను నిన్ననే చూసిందట.

 

దాంతో కస్తూరి కోపం కట్టులు తెంచుకుంది. అజిత్ లాంటి సూపర్‌స్టార్ అభిమానిని అని చెప్పుకుంటూ తన క్యారెక్టర్‌పై నీచమైన కామెంట్స్ చేసిన వ్యక్తికి బుద్ధి చెప్పాలనుకొని వెంటనే ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ..‘మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. కానీ ఇలా అజిత్ అభిమాని అని చెప్పుకుంటూ ఆడవాళ్లపై నీచమైన కామెంట్స్ చేసే వెధవలని ఏం చేయాలి? మీకు అమ్మాయిని చూడగానే సెక్స్ మాత్రమే గుర్తుకు వస్తే బయటికి వెళ్లే బదులు మీ అమ్మ దగ్గరికో లేక చెల్లి దగ్గరికో వెళ్లండి’ అని ఘాటుగా స్పందించారు. అంతే కాదు ఇలాంటి ఆడవాళ్లపై సెక్సిస్ట్ కామెంట్స్ చేసేవారిపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

అంతేకాదు ‘డర్టీ అజిత్ ఫ్యాన్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. దాంతో అజిత్ ఫ్యాన్స్‌కి కోపం వచ్చింది. కస్తూరి మీద కోపంతో వాళ్ళు కూడా ‘డర్టీ కస్తూరి ఆంటీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను క్రియేట్ చేశారు. దీనిపై కస్తూరి స్పందిస్తూ.. ‘అజిత్ అభిమానులకు ఉన్న ఏకైక ఉద్యోగం ఆడవాళ్లపై దరిద్రమైన కామెంట్స్ చేస్తూ పాపులర్ అవడం. తప్పు చేస్తున్న వారిని అదుపుచేయాల్సిందిపోయి వారితో చేతులు కలిపిన మీరు ఎంతకు దిగజారిపోయారో అర్థమవుతోంది’ అని మండిపడ్డారు. అయితే తనకి జరిగింది అన్యాయమే అయినా కస్తూరి ఇలా అమ్మ, సోదరి అంటూ వ్యాఖ్యలు చేసుండాల్సింది కాదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: