సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు  ఈ సంక్రాంతి సీజన్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద  భారీ  వసూళ్లను రాబట్టుకుంది. 9రోజుల్లో ఈ చిత్రం  తెలుగు రాష్ట్రాల్లో 98.82కోట్లషేర్ ను రాబట్టింది. దాంతో  అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి   బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది. ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం ఇంకా  బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇప్పటివరకు ఈసినిమా అక్కడ 2మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.  ఓవరాల్ గా సరిలేరు నీకెవ్వరు ,భరత్ అనే నేను ను దాటేసి మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం గా రికార్డు సృష్టించింది. 
 
సరిలేరు 9రోజుల వసూళ్ల వివరాలు : 
 
నైజాం -32.1కోట్లు                                                                           
సీడెడ్ - 14.25 కోట్లు          
ఉత్తరాంద్ర - 16.2 కోట్లు 
గుంటూరు -8.88 కోట్లు 
తూర్పు గోదావరి - 9.75 కోట్లు 
పశ్చిమ గోదావరి - 6.36 కోట్లు '
కృష్ణా - 7.77 కోట్లు 
నెల్లూరు - 3.51 కోట్లు 
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9రోజులకు గాను షేర్ = 98.82 కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: