అనుష్క పేరు వినగానే భాగమతి, జేజమ్మ, దేవసేన, అనే పాత్రలే గుర్తుకు వస్తాయి. ఇక ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోవడం ఈ బెంగళూరు భామ స్పెషాలిటీ. అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా ట్రైనర్ గా ఉండేది. ఇకపోతే అనుష్క నటిస్తున్న తాజాచిత్రం నిశబ్ధం. చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ పనులు ఎప్పుడో ముగించుకుని రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా రిలీజ్‌కు నోచుకోలేదు.

 

 

ఇదిలా ఉండగా తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారట. అసలే దేవసేన నటించిన చిత్రం కావడంతో ఆయా భాషల్లో ఈ సినిమాకు మంచి క్రేజ్ దక్కుతుందని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఈ సినిమాను అక్కడ కొనేందుకు బయ్యర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ చిత్రం పై భారీ స్దాయిలో అంచనాలను ఏర్పరచుకున్న నిర్మాతలు, ముందుగా హిందీ, తమిళ భాషల్లో సినిమా హక్కులు అమ్ముడయ్యాకే, ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నారట.

 

 

అందువల్ల జనవరిలో రిలీజ్ కావాల్సి ఉన్న ఈ చిత్రం, వాయిదా పడి ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిలా నటిస్తుండటం విశేషం. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయని అనుష్క మొదటి సారిగా డిఫరెంట్ యాంగిల్లో తెరపైన కనిపించనుండటంతో, ఈ సినిమాపై తెలుగునాట మంచి అంచనాలు ఏర్పడ్డాయని అనుకుంటున్నారు.

 

 

ఇక అనుష్క శెట్టి, ముఖ్యపాత్రలో నటిస్తుండగా మాధవన్, అంజలి, శాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్ సన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు హేమంత్ మధుకర్.. ఎంతో పాపులారిటి ఉన్న నటి చేసిన సినిమా కూడా ఇలా రిలీజ్‌కు నోచుకోకపోవడం అనుష్క బ్యాడ్‌లక్ అనుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: