సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు 81వ ఏట అడుగుపెట్టారు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఘ‌నంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల, సినీ పెద్ద‌ల అంద‌రి సమక్షంలో కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో హీరో ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెదనాన్నతో కలిసి ఆయ‌న పుట్టిన‌రోజు వేడుక‌ల్లో పాల్గొన్నారు. అలాగే అక్క‌డ‌కు అతిధిగా వెళ్ళిన చిరంజీవిగారితో క‌లిసి ఎంతో ఆనందంగా ఫొటోలు కూడా దిగారు. ఇంకా మోహ‌న్‌బాబు, మంచు విష్ణు సినీ పెద్ద‌లంద‌రి స‌మ‌క్షంలో ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రిగాయి.  ఈ పుట్టినరోజు వేడుక‌ల్లో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, మెగాస్టార్ చిరంజీవి ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. 

 

ఇటీవ‌లె విడుద‌లైన చిరంజీవి న‌టించిన‌ సైరా చిత్రం సూప‌ర్‌హిట్ అయిన విష‌యం తెలిసిందే. స్వ‌తంత్య్ర స‌మ‌ర‌యోధుడి చ‌రత్ర ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం ఇది సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. చిరంజీవి తన 152వ సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సామాజిక అంశాలను ఎలివేట్ చేయడంలో  కొరటాల శివ దిట్ట అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఇటీవలే మ‌హేష్ 'భరత్ అనే నేను' రూపంలో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈయన.. ఎప్పటిలాగే ఈ సినిమా కోసం బలమైన, ఆసక్తికరమైన కథాంశంతో స్క్రిప్ట్ రెడీ చేశారని తెలిసింది. చిరంజీవి కెరీర్‌లోనే స్పెషల్‌గా నిలిచేలా ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట కొరటాల.

 

ఇక రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విష‌యానికి వ‌స్తే ... ప్రభాస్‌ కొత్త సినిమా యూనిట్ చేసిన ప్రకటన అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. సినిమా అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ లేదా టైటిల్‌ లోగో ఇస్తార‌నుకున్నారు. కానీ ప్రభాస్‌ మాత్రం  కేవలం ఈ రోజు నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభిస్తున్నాం అంటూ ఓ ఫోటోతో ఇన్స్‌స్టాగ్రామ్‌ పోస్ట్ పెట్టారు ప్ర‌భాస్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: