అర్జున్ రెడ్డి సినిమాతో వరల్డ్ ఫెమస్ అయిన హీరో విజయ్ దేవరకొండ.. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారుగా అలా ఒక్క సినిమా విజయ్ ఫెట్ ను మార్చేసింది. ఆ సినిమా మామూలు విజయాన్ని అందుకోలేదు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆ తరువాత వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. 


సినిమా తర్వాత విజయ్ నటించిన సినిమా గీతగోవిందం.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. కాగా, ఆతర్వాత వచ్చిన టాక్సీవాలా సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే మొన్న వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా విజయ్ దేవరకొండ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ హీరో ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు. 

 

ఈ సినిమాకు క్రాంతి మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పేరు వరల్డ్ పేమస్ లవర్.. . ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ సరసన నాయికలుగా రాశి ఖన్నా ,కేథరిన్ ,ఐశ్వర్య రాజేశ్, ఇజబెల్లా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో నటిస్తున్న ఒక్కో కథానాయిక పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రం నుండి విడుదలయిన ఈటీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా  ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు.. ప్రేమంటే ఒక శాక్రిఫైజ్ అంటూ మొదలయిన డైలాగులు యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ టీ. టీజర్ చూడటానికి అర్జున్ రెడ్డి సినిమా ను తలపిస్తుందని సదరు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో యామిని పాత్రలో రాశిఖన్నా నటిస్తున్నారు. గౌతమ్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. 


సినిమా నుండి తాజాగాసాంగ్ విడుదల అయింది. ఈ పాటలో రొమాంటిక్ విజయ్ కనిపించడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజు సందర్బంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు. పూరి జగన్నాద్, తెరకెక్కిస్తున్న ఫైటర్ సినిమాలో నటిస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: