మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ అంటే అక్కడ ఎంత క్రేజ్ ఉందో.. తెలుగు నాట కూడా అందే క్రేజ్ ఉంది.  ఈ మద్య ఆయన నటించిన డబ్బింగ్ మూవీస్ తెలుగు లో కూడా బాగా రన్ అవుతున్నాయి.  కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ మూవీ మంచి విజయం అందుకుంది.  ప్రస్తుతం జాతీయ స్థాయిలో బయోపిక్ మూవీస్ కి ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కూడా రాబడుతున్నాయి. బాహుబలి2 మూవీ తర్వాత పాన్ ఇండియా మూవీస్ పై ఎక్కువగా దర్శక, నిర్మాతలు దృష్టిపెడుతున్నారు.  మాలీవుడ్ లో సైతం చారిత్రాత్మక సినిమాలు ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే.  

 

తాజాగా మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్న తాజా హిస్టారికల్‌ మలయాళ మూవీ ‘మరక్కర్‌: అరబికడలింటే సింహం’. ఈ మూవీకి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించారు.  16వ శతాబ్దానికి చెందిన కుంజాలి  మరక్కర్‌ అనే  నావికుడి  జీవితం ఆధారంగా ఈ  మూవీ తెరకెక్కించారు. కాగా ఈ  సినిమా  చిత్రీకరణ  పూర్తయింది. మోహన్‌లాల్‌  యంగ్‌  పాత్రలో  ఆయన  కొడుకు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ నటించారు.  ప్రస్తుతం చరిత్రను చాటి చెప్పే వీర యోధుల గురించి వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.

 

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించిన ‘తానాజీ’ దాదాపు రెండు వందల కోట్ల క్లబ్ లో చేరబోతుందని వార్తలు వస్తున్నాయి.  మోహన్‌లాల్‌ యువకుడిగా ఉన్న పాత్రలో ఆయన కొడుకు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ నటించారు. ఆర్చ అనే పాత్రలో కనిపించనున్నారు కీర్తీ సురేష్‌. ఆమె క్యారెక్టర్‌ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. సాంప్రదాయంగా కనిపిస్తున్న కీర్తి సురేష్ లుక్ కి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఈ మూవీపై ఈ అమ్మడు భారీ ఆశలే పెట్టుకుందట. ఈ మూవీ హిట్ అయితే మహానటి బయోపిక్ లా మరో మంచి పేరు వస్తుందని ఆశపడుతున్నట్లు కోలీవుడ్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: