బాహుబలి వంటి భారీ విజయం తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలి అని కుర్ర డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ నేపథ్యం కలిగిన స్టోరీ ‘సాహో’ సినిమా చేయడం జరిగింది. దాదాపు రెండు సంవత్సరాలు టైం ఏం సాహో సినిమాకి కేటాయించటం అతి భారీ బడ్జెట్ తో ప్రభాస్ కెరీర్ లోనే తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. తీరా సినిమా రిలీజ్ అయిన మొట్టమొదటి షోకే ప్లాప్ టాక్ రావడంతో తీవ్ర నిరుత్సాహం చెందారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ఇటువంటి తరుణంలో జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రేమ కథ నేపథ్యం కలిగిన స్టోరీ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా పోయే ఛాన్స్ ఉందని కెరీర్లో అతి పెద్ద రిస్క్ ప్రభాస్ చేస్తున్నాడు అంటూ సినిమా విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.

 

బాహుబలి సినిమా తో భారీ రేంజ్ లో ఊహించిన ప్రభాస్ కి సాహో సినిమా సరైన న్యాయం చేయలేక పోయింది అటువంటిది ఎటువంటి హిట్లు లేని డైరెక్టర్ రాధాకృష్ణ ని నమ్ముకుని ప్రభాస్ సినిమా చేయటం ప్రమాదకరమైన ప్రయత్నమని కామెంట్లు రావడంతో మళ్లీ ప్రభాస్ కి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ పడుతుందేమోనని డార్లింగ్ అభిమానులు వణికిపోతున్నారు. కాగా ఈ సినిమాని ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు నిర్మాణ సంస్థ గోపికృష్ణ మూవీస్ నిర్మించడంతో కొద్దిగా హోప్స్ ప్రభాస్ అభిమానులు పెట్టుకున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో ఇటీవల కృష్ణం రాజు బర్త్ డే వేడుకలు చాలా ఘనంగా జరగటంతో ఆ వేడుకల్లో పాల్గొన్న ప్రభాస్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో రావడంతో ప్రభాస్ లుక్ కి అదిరిపోయే కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. టెక్నికల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: