టాలీవుడ్ లోకి ముకుంద, ఒక లైలా కోసం మూవీస్ తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డె.  అయితే ఈ మూస్ పెద్దగా సక్సెస్ కాలేదు.  దాంతో బాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టింది.  అక్కడ కూడా సక్సెస్ కాలేదు.. అదే సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ మూవీలో బికినీ సీన్లో రెచ్చిపోయింది. అంతే.. ఈ ఒక్క సినిమా ఈ అమ్మడి జాతం మార్చేసింది.  వరుసగా ఎన్టీఆర్, మహేష్ బాబు, వరుణ్  తేజ్, అల్లు అర్జున్ తో రెండోసారి నటించే అవకాశం దక్కించుకుంది.  ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ అక్కినేనితో నటిస్తుంది. 

 

తాజాగా ఈ అందాల భామ  క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం ఆర్థిక సహాయం చేసి తన ఉదారతను చాటారు. ఇలాంటి బాధితులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.  హైదరాబాద్ లో క్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పూజ ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. అయితే అక్కడ చిన్నారులను చూసి పూజా హెగ్డే తన మనసు లో మాట చెప్పింది.   ఈ సంస్థ ద్వారా లబ్ధిపొంది క్యాన్సర్ నుంచి బయటపడ్డ పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల కోసం రూ.2.5 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. తన స్నేహితులు కూడా వైద్యులేనని చెప్పారు.

 

వైద్యుడే నిజమైన హీరో అని భావిస్తాను అని పూజ పేర్కొన్నారు. అందుకే  దేవుడి తర్వాత వైద్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఎలాంటి ప్రాణం నిలపాలన్నా వైద్యుల వల్లనే అవుతుందని.. వైద్య శాస్త్రం చాలా గొప్పదని అన్నారు.  వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని అన్నారు.   ‘ క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం తగినన్ని నిధులను సమకూర్చి వారి జీవితాలను కాపాడాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ జీవితంలో మంచి పనులు చేయాలని అనుకుంటారు.  కానీ మన జీవితంలో ఓ మంచి పని చేయాలన్న సంకల్పం ఉండాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: