జూనియర్ ఎన్టీఆర్ పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. నందమూరి నట వారసునిగా అసలుసిసలైన పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో నాటుకు పోయారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల కొనసాగుతున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్సినిమా చేసినా ఆ సినిమాలు పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ ఉంటాడు. ఎలాంటి పాత్రలైనా అద్భుతమైన హావభావాలు పలికిస్తూ.. ప్రేక్షకులు అందరినీ తన నటనతో ఔరా  అనిపిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి  నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం  ఉంటుంది అన్న విషయం తెలిసిందే. 

 

 

 జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళినా అందరితో సరదాగా మాట్లాడుకుంటూ పంచులు వేస్తూ ఉంటారు. స్టార్ హీరో అయినప్పటికీ కూడా.. అందరితో కలివిడిగా ఉంటూ... జోకులు పేలుస్తూ అంటారు. అద్భుతమైన నటనతో పాటు మంచి అద్భుతమైన సెన్సాఫ్ హ్యూమర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ సొంతం. ఎక్కడికి వెళ్ళినా తనదైనా స్టైల్ లో చమత్కరిస్తూ  ఉంటారు. ఇక ఎన్టీఆర్ మాట్లాడుతుంటే ఎప్పుడు ప్రేక్షకులు ఆకర్షితులవుతూ  ఉంటారు. అయితే ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ తో ఎన్టీఆర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.కాల్పనిక కథ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. అయితే షూటింగ్ గ్యాప్ రావడంతో ఓ  యాడ్ లో  నటించేందుకు ముంబై వెళ్లారు ఎన్టీఆర్. ఇక తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 

 

 

 ముంబై నుండి హైదరాబాద్ చేరుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వస్తున్న సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ ఎన్టీఆర్ ని ఫోటో తీసుకున్నారు. అయితే ఆ ఫోటోగ్రాఫర్ ని దగ్గరకు పిలిచి ఛలోక్తులు  విసిరారు జూనియర్ ఎన్టీఆర్. అసలు నువ్వు ఇంటికి వెళ్ళవా... ఎప్పుడు ఏయిర్ పోర్ట్  లోనే ఉంటావా... ఖానా పీనా సోనా అన్ని  ఇక్కడేనా అంటూ ఫోటోగ్రాఫర్ తో చమత్కరించాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే గతంలో ఇదే విమానాశ్రయంలో ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ ని ఎన్టీఆర్ గుర్తుపట్టి మరి దగ్గరకు పిలిచి మాట్లాడడంతో ఫోటోగ్రాఫర్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఎన్టీఆర్ చమత్కారానికి ఆ ఫోటోగ్రాఫర్ కూడా కాస్త నవ్వుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: