గత కొంతకాలంగా బాలీవుడ్ లో ప్రేమ పెళ్లిలు చాలా జరుగుతున్నాయి. హీరోయిన్స్ ను క్రికెటర్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. హీరో హీరోయిన్స్ ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం బాలీవుడ్ లో రెగ్యులర్ అయిపోయింది.. సౌత్ గాని నార్త్ గాని సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు కొత్తేం కాదు. గతంతో పోల్చితే ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా పెళ్లికి దారి తీస్తున్నాయి. గతంలో ప్రేమించుకోవడం కొన్నాళ్ళు చెట్టా పట్టాలేసుకొని తిరగడం ఆ తర్వాత మాకు పొంతన కుదరలేదంటూ సింపుల్ గా విడిపోవడం జరిగేవి. కానీ ఇప్పుడు లా కాదు ప్రేమించుకున్న జంటలు పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు. కాజోల్, అజయ్ దేవగన్ నుంచి మొన్నటి రణ్ వీర్ సింగ్ దీపిక పదుకొణే వరకు బాగానే కొత్త జంటలను చూశాము. అయితే మలైకా అరోరా, అర్జున్ కపూర్ప్రేమ మాత్రం పెళ్లి వరకు వెళ్లడం లేదు. అసలు వీళ్ళు పెళ్ళి చేసుకుంటారా అంటే ఇరువైపుల నుండి గాని వాళ్ళ సన్నిహితుల దగ్గర్నుంచి గానీ సమాధానం రావడం లేదు. 

 

ఈ ఇద్దరు గత నాలుగు అయిదు సంవత్సరాలుగా కలిసే ఉంటున్నారు. మలైకా అరోరాకు అర్భాజ్ ఖాన్ కు విడాకులు అధికారికంగా వచ్చిన తర్వాత వీళ్ళ ప్రేమ వ్యవహారం బాగా ముదిరింది. అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇవ్వడానికి కారణం అర్జున్ కపూర్ అంటూ ఆమద్య బాలీవుడ్ లో జోరుగా ప్రచారం కూడా జరిగింది. ఎప్పుడైతే అర్భాజ్ ఖాన్ నుండి విడాకులు వచ్చాయో వెంటనే అర్జున్ కపూర్ ను మలైకా పెళ్లి చేసుకుంటుందని అందరూ ఊహించారు. అందుకే అది ఊహగానే ఉంది ఇప్పటికి. వీళ్ళిద్దరు ప్రేమించుకోవడం మొదలు పెట్టారు కాని పెళ్లి విషయంలో మాత్రం ఎందుకనో ఆసక్తి చూపించడం లేదు. బహుషా ఇలానే బావుందేమో. ఉన్నన్నాళ్ళు ఉండి తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుందామని నిర్ణయించుకున్నారనుకుంటా అని ఇప్పటికే చాలా మంది చెప్పుకుంటున్నారు.

 

ప్రస్తుతం మొరాకోలో ఈ జంట చెట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే మొరాకో వెళ్లిన వీరు అక్కడే ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ జోడీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరు పెళ్లి విషయం వచ్చేప్పటికి సైలెంట్ అవుతున్నారు. ప్రేమ వ్యవహారంను మొదట్లో రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించిన మలైకా కొన్నాళ్లుగా ఎవరినీ లెక్కచేయకుండా తిరుగుతోంది. అర్జున్ కు ముద్దులు పెడుతూ ఫొటోలు దిగి వాటిని పోస్ట్ చేస్తుంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్  ముద్దు ముచ్చట్ల వరకేనా పెళ్లి చేసుకునేది లేదా అంటూ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో అటు మలైకా గాని ఇటు అర్జున్ కపూర్ గానీ స్పందించింది లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: