పవన్ కళ్యాన్ ఏం చేసినా షాకింగానే ఉంటుంది. ఒక సినిమా విషయంలో నిర్ణయమైనా, రాజకీయాలలో ఏదైనా స్టెప్ తీసుకోవాలన్న కాస్త షాకింగానే ఉంటుంది. ఇపుడు పింక్ రీమేక్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమా విషయంలో దిల్ రాజు కి పవన్ షాకిచాడని, సినిమా ఆగిపోయిందని, పవన్ సినిమా నుండి డ్రాపయ్యాడని, అసలు ఏ విషయం తేల్చకుండా దిల్ రాజుని ఇరకాటంలో పెట్టాడని ..ఇలా గత కొన్ని రోజులుగా రాని పుకార్లు లేవు. అయితే వీటన్నికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక్కరోజులో అందరికి పవన్ అంటే ఏంటో చూపించాడు. రాజకీయంగా అసెంబ్లీలో వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. మూడు రాజధానుల విషయంలో నానా రచ్చా జరుగుతోంది. అయితే పవన్ మాత్రం వీటితో తనకు సంబంధం లేనట్టుగా పవన్ కల్యాణ్ తిరిగి ముఖానికి మేకప్ వేసుకొని సైలెంట్ గా కెమెరా ముందుకొచ్చారు.  

 

ముందస్తు ప్రణాళికా అంటూ ఏమీ లేకుండా సడన్ గా మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు పవన్. సోమవారం నుంచి పింక్ తెలుగు రీమేక్ సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ లో 'జనసేన అధ్యక్షుడు' జాయిన్ అయ్యారు. హైదరాబాద్ లోని అల్వాల్, ఓల్డ్ బోయిన్ పల్లి మధ్యలో పవన్ కళ్యాన్ పై కొన్ని సన్నివేశాలు షూట్ చేశారు. 


వాస్తవంగా ఈ సినిమా కోసం అన్నపూర్ణ ఏడెకరాల స్టుడియోస్ లో కోర్టు సెట్ వేశారు. ఆ సెట్ లోనే పవన్ తో షూట్ స్టార్ట్ అవుతుందని ప్లాన్ చేశారు. వందల సంఖ్యలో పవన్ అభిమానులు కూడా సొమవారం పొద్దున్న స్టుడియో ముందు పోగయ్యారు. ఆయన కోసం ఎదురు చూశారు. కానీ పవన్ మాత్రం అల్వాల్-ఓల్డ్ బోయిన్ పల్లి మధ్య ప్రత్యక్షమయ్యారు. అది కూడా ఉదయం 8 గంటలకే లొకేషన్ కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 అయ్యేసరికి షూటింగ్ ప్యాకప్ చెప్పారు. 

 

ఇక్కడ జరిగిన షూటింగ్ లో పవన్ పై మాంటేజ్ షాట్స్ మాత్రమే తీశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం మాంటేజ్ షాట్స్ తోనే మొదటి రోజు షూటింగ్ కంప్లీట్ చేశారు. బహుషా పవన్ కి కూడా ఇలా జరగడం మొదటి సారే కావచ్చు. ఇక పవన్ ప్రస్తుతం ఎలా అయితే ఉన్నారో అలానే ఆ గడ్డంతోనే సినిమాలో కూడా ఉన్నారు. గడ్డంతో తీయాల్సిన షాట్స్ పూర్తయిన తర్వాత క్లీన్ షేవ్ లోకి మారతారని అంటున్నారు. ఇదిలా ఉంటే మొదటి రోజే లీకుల పర్వం మొదలైంది. అవుట్-డోర్ షూటింగ్ కావడంతో లొకేషన్ లో పవన్ నడుస్తున్నప్పుడు ఎవరో ఫొటో తీశారు. ఆ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా 'లాయర్ సాబ్' అనే టైటిల్ పరిశీలనో ఉన్నట్టుగా తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: