‘అజ్ఞాతవాసి’ షాక్ తో రెండేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ రీ ఎంట్రీ మూవీ ‘పింక్’ రీమేక్ నిన్న ప్రారంభోత్సవం జరిగినా నిన్నటిరోజున అమరావతి అంతా మండిపోయిన నేపధ్యంలో పవన్ సలహా మేరకు ఈమూవీ ప్రారంభోత్సవ న్యూస్ ను ఫోటోలను బయట పడనీయకుండా గట్టి జాగ్రత్తలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు నిన్నటి రోజున ఈ మూవీ షూటింగ్ సికింద్రాబాద్ దగ్గరలోని ఆల్వాల్ ప్రాంతంలో ఒక ఇంటిలో జరిగినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈమూవీకి సంబంధించిన షూటింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభించాలని దిల్ రాజ్ భావిస్తే పవన్ ఈమూవీ షూటింగ్ ను ఉదయం 7 గంటలకే ప్రారంభించమని విజయవాడలో తన ‘జనసేన’ పార్టీ సమావేశం మధ్యాహ్నం ఉంది అని చెప్పి కేవలం రెండు గంటలు మాత్రమే ఈ మూవీ షూటింగ్ స్పాట్ లో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన తమిళ రీమేక్ లో అజిత్ గతంలో గెడ్డంతోనే నటించాడు కాబట్టి అదేవిధంగా తెలుగు రీమేక్ లో కూడ తాను గెడ్డంతోనే ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది.

ముందుగా కోర్టు సీన్స్ అన్నీ షూట్ చేసిన తరువాత పవన్ గెడ్డం తీసేసి చేయాల్సిన సీన్లు అలాగే ఒక డ్యూయట్ కూడ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘పింక్’ ఒరిజనల్ కథకు చాల మార్పులు చేర్పులు జరిగాయని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా పవన్ ‘పింక్’ రీమేక్ షూటింగ్ ప్రారంభం అయింది అన్న వార్తలు లీక్ అవ్వడంతో కొందరు పవన్ కళ్యాణ్ ను కార్నర్ చేస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. 

జ‌గ‌న్ మంచి ప‌రిపాల‌న అందిస్తే ఆనందంగా తాను సినిమాలు చేసుకుంటాన‌ని గతంలో విశాఖ‌పట్నంలో జరిగిన భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు మ‌ద్ద‌తుగాజరిగిన లాంగ్ మార్చ్ సభలో ఆవేశంగా పవన్ అన్న మాటలను గుర్తుకు చేస్తూ పవన్ ఇప్పుడు మళ్ళీ సినిమాలలో నటిస్తున్నాడు అంటే జగన్ పరిపాలన బాగుంది అని పవన్ పరోక్షంగా ఒప్పుకున్నట్లేనా అంటూ కొందరు పవన్ ను కార్నర్ చేస్తూ జోక్స్ వేస్తున్నారు.  ఇది ఇలా ఉంటే మరో రెండు రోజులలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న మున్సిపాలిటీ ఎన్నికలలో పవన్ అభిమానులు అంతా తమకు ఓటు వేయాలని భారతీయ జనతా పార్ట్ అభ్యర్ధులు నిన్న ఓపెన్ గా ప్రకటలు ఇచ్చిన నేపధ్యంలో ఆంధ్రరదేశ్ లో పవన్ పిలుపుకు పెద్దగా స్పందించని పవన్ అభిమానులు ఇప్పుడు పవన్ రూట్ మార్చడంతో పవన్ పేరుతో ఇవ్వబడ్డ ఈ పిలుపుకు స్పందిస్తారా అన్నది సమాధానం లేని ప్రశ్న..     

 

మరింత సమాచారం తెలుసుకోండి: