విజ‌య్ దేవ‌ర‌కొండ నటించిన డియర్ కామ్రేడ్ పెద్ద డిజాస్టర్ గా మిగిలిన విషయం అందరికి తెలిసిందే. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నిటిలో అతి పెద్ద డిజాస్టర్ అంటే డియర్ కామ్రేడ్ అని చెప్పక తప్పదు. నెలరోజులు కాళ్ళలు చక్రాలు కట్టుకొని మరీ సినిమాని ప్రమోట్ చేసిన కూడా విజయ్ కి ఒరిగిందేమి లేదు. ఇక ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. అదే క్రేజ్ బాలీవుడ్ ప్రేక్ష‌కుల్లోను. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క హిందీ సినిమాలో న‌టించ‌క‌పోయినప్పటికి అర్జున్ రెడ్డి సినిమా పరంగా విజయ్ కి అక్క‌డ మంచి క్రేజ్ నెలకొంది. ఇటీవ‌లే అర్జున్ రెడ్డి సినిమాను హిందీలోకి డ‌బ్ చేసుకుని అక్క‌డ జ‌నాలు చూశారు. క‌బీర్ సింగ్ పేరుతో హిందీలో ఆ సినిమా రీమేక్ అయినా, మ‌ళ్లీ తెలుగు వెర్ష‌న్ ను హిందీలోకి డబ్ చేసుకున్నారంటే విజయ్ మీద అభిమానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

 

ఇక్కడ అందరు షాకయ్యో విషయం ఏంటిటంటే తెలుగులో ఫ్లాప్ గా నిలిచిన డియ‌ర్ కామ్రేడ్ హిందీ ప్రేక్షకుల్లో మంచి ఆస‌క్తి క‌నిపిస్తూ ఉంది. తాజాగా ఆ సినిమాను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో విడుద‌ల చేశారు. థియేట్రికల్ రిలేజ్ కు పెద్ద‌గా ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌కుండా యూట్యూబ్ లో విడుద‌ల చేశారు. అయినా కూడా డియ‌ర్ కామ్రేడ్ సినిమాకు బాలీవుడ్ జనాలు విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు. ఎగబడి మరీ చూసేస్తున్నారు. ఇది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

 

డియ‌ర్ కామ్రేడ్ విడుద‌ల అయిన 24 గంట‌ల్లోనే యూట్యూబ్ లో 11 మిలియ‌న్ల వ్యూస్ ను రాబట్టిందట. డియ‌ర్ కామ్రేడ్ టాలీవుడ్ తో పాటు మిగతా మూడు భాషల్లో కూడా భారీ అంచ‌నాలతో విడుద‌లయిన సంగ‌తి తెలిసిందే. ఆ అంచ‌నాల‌ను అందుకోలేక ఆ సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా నిలిచింది. రన్ టైం పెద్ద మైనస్ అయితే అసలు కాన్సెప్ట్ ఎవరికీ అర్థం కాకపోవడం, సినిమా చూసినోళ్ళకి నీరసం రావడం మరోమైనస్. ఇక ఈ సినిమా అమెజాన్ లో కూడా అందుబాటులోకి వ‌చ్చింది. అక్కడ ఈ సినిమాని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు హిందీ వెర్ష‌న్ ఒక్క రోజులో కోటీ ప‌ది ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ ను సాధించడం గమనర్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి: