నిన్న అమరావతి అట్టుడికిపోతుంటే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘పింక్’ రీమేక్ మొదలుకావడం యాధృశ్చికమే అయినా నిన్నటిరోజున ఈ మూవీకి సంబంధించిన మొదటిరోజు షూటింగ్ లో రొటీన్ కు భిన్నంగా షూటింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఒక టాప్ హీరో సినిమా షూటింగ్ మొదటిరోజున ఆ హీరోను ఎలివేట్ చేసే డైలాగ్ తో మొదటి షాట్ తీస్తారు.

అయితే దీనికి భిన్నంగా నిన్న ప్రారంభం అయిన ‘పింక్’ రీమేక్ షూటింగ్ లో పవన్ పై మాంటేజ్ షాట్స్ మాత్రమే తీసినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ పై ఎలాంటి డైలాగ్స్ సీన్స్ తీయలేదని లీకులు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన కోర్టు సెట్ లో ఈ మూవీ ప్రారంభం అవుతుంది అని తెలుసుకుని పవన్ అక్కడకు వస్తాడని భావించి వేల సంఖ్యలో పవన్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర వేచి ఉన్నారు. 

అయితే పవన్ కళ్యాణ్ అతి రహస్యంగా అల్వాల్ ఓల్డ్ బోయిన్ పల్లి మధ్య ఉన్న ఈ మూవీ షూటింగ్ స్పాట్ కు చేరుకొని సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉండి పేకప్ చెప్పి హడావిడిగా విజయవాడ వెళ్ళిపోయాడు. నిన్నటి రోజున ఒకవైపు అసెంబ్లీ సమావేశం జరుగుతూ ఉండగానే పవన్ తన అనుచరులతో కలిసి నిన్నటి రోజున జరిగిన ఘర్షణలో గాయపడ్డ రైతులను పరామర్శించడానికి అమరావతి ప్రాంతంలోని గ్రామాలకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

నిన్న ఒకవైపు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మూడు రాజధానుల తీర్మానం ఆమోదింప బడినా పవన్ కళ్యాణ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే అనీ ఎవరు ఎన్ని తీర్మానాలు చేసినా తాను లెక్క చేయనని కామెంట్స్ చేసాడు. భారతీయ జనతా పార్టీ జనసేన ల కలయిక వల్ల ఈ మూడు రాజధానుల ముచ్చట మూడు రోజులు మాత్రమే అని కామెంట్ చేసాడు. ఇది ఇలా ఉంటే ఒక్క అమరావతి ప్రాంత గ్రామాల ప్రజలు తప్ప ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతం ప్రజలు రాజధాని మార్పు గురించి పట్టించుకోని పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ఏ ధైర్యంతో ఈ కామెంట్స్ చేస్తున్నాడు అన్న మాటాలు వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: