ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పవర్‌స్టార్ అభిమానులకు కాకినాడ ఖాజా లాంటి తీపివార్త. ఎప్పుడెప్పుడు వెండితెరపై పవన్ స్టైల్‌ను చూసి మురిసిపోదామా అని ఇంతకాలం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసారు ఆయన అభిమానులు. రాజకీయాల్లో ప్రసంగాలకు విసుగొచ్చొందో ఏమో. ఇంతకాలం పవన్ నోటిలో నానుతూ పవర్ ఫుల్ డైలాగులు బయటికి రాలేక పురిటి నొప్పులు పడినాయో ఏమో, ఇప్పుడు సమయం వచ్చినట్లు ఉంది.

 

 

ఇక పవన్ సినిమా అనగానే ఎడారిలో వర్షం కురిసినట్లుగా ఫీలవుతున్నారట అభిమానులు. ఇదిలా ఉండగా తన రెమ్యూనరేషన్ విషయంలో భారీగానే టార్గెట్ పెట్టుకున్నాడట. అంతే కాకుండా ఇంతకాలం ఆలస్యం అవుతూ ఇదిగో వస్తున్నాడు పవన్, అదిగో వస్తున్నాడు పవన్ అంటూ సాగుతున్న ‘పింక్‌’ తెలుగు రీమేక్‌ ‘లాయర్‌ సాబ్‌’ చిత్రం షూటింగ్‌కి తాజాగా జాయిన్‌ అయ్యాడట పవన్.. ఇక్కడితో ఆగిపోకుండా ఇకపై వరుసగా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. ఇకపోతే త్వరలో క్రిష్‌ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడని సమాచారం.

 

 

అయితే ఈ చిత్రం ఎప్పుడో పట్టాలు ఎక్కవలసి ఉండగా కొన్ని కారణాల వల్ల వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చిందట.. దీని తర్వాతి ప్రాజెక్ట్‌కు కూడా చేయడానికి  పవన్‌ కళ్యాణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు పవన్‌ కళ్యాణ్‌ నుంచి అధికారికంగా సినిమాల్లో నటించడంపై ఎలాంటి స్పష్టతా రాలేదు. కానీ ఎప్పటి నుండో నానుతున్న పింక్ రిమేక్ ‘లాయర్‌ సాబ్‌’ షూటింగ్‌లో పాల్గొన్న కొన్ని ఫొటోలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

 

ఇక ఇంతవరకు బాగానే ఉందిగాని తన పారితోషకం విషయంలో ఏమాత్రం తగ్గకుండా 50 కోట్ల పైన వసూలు చేసుకుంటున్నట్లుగా వినికిడి. ఇలా పవన్ చేయబోయే మొత్తం మూడు సినిమాలకు గాను దాదాపు 200 కోట్ల దాకా రాబట్టుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఏమో పవన్ గుట్టు ఇంత లోతుగా అధ్యాయనం చేసి ఇప్పటివరకు ఇది అని ఎవరు చెప్పలేదు. కాని పవన్‌ కళ్యాణ్‌ పేరుతో ఓ పక్క రాజకీయ రచ్చ, మరో పక్క సినీ రచ్చ పీక్స్‌కి వెళ్ళిపోయాయన్నది మాత్రం నిర్వివాదాంశం...

మరింత సమాచారం తెలుసుకోండి: