‘అల వైకుంఠపురములో’ మూవీ ఘన విజయంలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ లతో సమానంగా నటుడు మురళీ శర్మకు పాత్ర ఉంది అన్న విషయం ఎవరు కాదనలేని నిజం. ముఖ్యంగా తన కొడుకు కోటీశ్వరుడుగా మారాలి అని భావించే ప్రతి సగటు తండ్రి ఆలోచనలను ప్రతిబింబించే విధంగా అతడి పాత్ర డిజైన్ చేయబడింది. స్వార్ధంతో కూడిన ద్వేషాన్ని నటించి మెప్పించడంలో మురళీ శర్మ ఈ పాత్రకు జీవం పోసాడు.

ప్రస్తుతం కలక్షన్స్ రికార్డులను తిరగ రాస్తున్న ఈ మూవీ విషయంలో మురళీ శర్మకు అన్యాయం జరిగింది అంటూ గాసిప్పులు వస్తున్నాయి. వాస్తవానికి మురళీ శర్మ తాను నటించే రోజులను బట్టి రోజువారి పారితోషికం తీసుకుంటాడు. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించి మురళీ శర్మకు రోజువారి పారితోషికం కాకుండా అతడు ఈ సినిమాకు ఇచ్చిన 50 రోజుల కాల్ షీట్స్ కు సరిపడే విధంగా ఒక మొత్తాన్ని పారితోషికంగా మాట్లాడుకున్నట్లు టాక్. 

వాస్తవానికి ఇలా నటించడం మురళీ శర్మకు ఇష్టం లేకపోయినా త్రివిక్రమ్ తో అతడికి ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఇలా ఒప్పుకోవలసి వచ్చింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి ముందుగా అనుకున్న రీతికి భిన్నంగా మురళీ శర్మ పాత్ర పెరిగి పోవడంతో అతడు ఈ సినిమాకు 70 రోజుల కాల్ షీట్స్ ఇచ్చి పనిచేయవలసి వచ్చిందట. 

అయితే తాను అదనంగా పనిచేసిన 20 రోజుల వర్క్ కు అదనపు పారితోషికం ఇస్తారని మురళీ శర్మ ఆశించినా ఈ సినిమా నిర్మాతలు ఏమి మాట్లాడక పోవడంతో మురళీ శర్మ తీవ్ర అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలు త్రివిక్రమ్ దృష్టి వరకు వచ్చినా త్రివిక్రమ్ మురళీ శర్మను సముదాయిస్తూ మరొక సినిమా విషయంలో మురళీ శర్మకు న్యాయం చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో అలకవహించిన మురళీ శర్మ ‘అల వైకుంఠపురములో’ మూవీకి సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఈమధ్యనే జరిగిన విజయోత్సవ సభకు అసహనంతో డుమ్మా కొట్టాడు అన్న గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: