సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడో తెలిసిన విషయమే. గీతా ఆర్ట్స్ బ్యానర్ వాల్యూను ఆయన నిర్మించిన సనిమాల ద్వారా ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. కెరీర్లో ఎన్నో విజయాలు సాధించిన అల్లు అరవింద్ కు తాజాగా కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన 'ఇంటరాక్టివ్ ఫోరం ఆన్ ఇండియన్ ఎకనామీ' సంస్థ వివిధ అంశాల్లో విశిష్ఠ సేవలు అందించిన వారికి ఈ అవార్డులు అందిస్తుంది. ఇటివల ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.

 

 

ఈమేరకు అరవింద్.. 'మాజీ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సహా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు గానూ దక్కిన ఈ అవార్డు ఎంతో విలువైనదన్నారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీకి కృతజ్ఞతలు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు రక్తదానం చేసిన దాతలకు, నా సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఈ అవార్డు అంకితం. 40 సంవత్సరాల నా ప్రయాణంలో సేద తీర్చుకోవడానికి ఈ అవార్డులు ఉపయోగపడతాయి. భవిష్యత్తులోనూ సమాజానికి నా వంతు సేవలు కనసాగిస్తాను' అని ఓ ప్రకటనలో అల్లు అరవింద్ తెలిపారు.

 

 

తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో అనేక సినిమాలు నిర్మించారు అల్లు అరవింద్. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ అవార్డును అల్లు అరవింద్ తో పాటు వివిధ రంగాల్లో సేవలు చేస్తున్న వారితోపాటు కొంతమంది క్రీడాకారులను కూడా ఈ అవార్డుకు ఎంపిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: