మాస్ మహారాజ్ రవితేజ గత కొన్ని రోజులుగ హిట్లు లేక అవస్థలు పడుతున్నాడు. రాజా ది గ్రేట్ తర్వాత మళ్లీ హిట్ పడలేదు. అయితే ఈ సారి మాత్రం హిట్ పడుతుందనే కాన్ఫిడెంట్ గ్తో ఉన్నాడు. ఆయన నటించిన డిస్కో రాజా ఈ నెల 24 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విభిన్న చిత్రాల దర్శకుడు వీ ఐ ఆనంద్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించగా జాతోఈయ ఉత్తమ నటుడిగా పేరు అవార్డు సాధించిన బాబ్ సింహా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.

 

 


అయితే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. రవితేజ మునుపటి సినిమాలతో పోల్చితే ఈ సినిమాకి మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే సమస్యల్లా రిలీజ్ టైమింగ్ లోనే ఉంది. ఈ సంక్రాంతి కి తెలుగులో విడుదల అయిన సినిమాలన్ని మంచి టాక్ తెచ్చుకున్నాయి. దాంతో జనాలందరూ ఆ సినిమాలు చూడడానికి ఎగబడుతున్నారు. ఇప్పటికీ కూడా ఆ సినిమాలు థియేటర్లలో హౌస్ ఫుల్స్ షోలతో నడుస్తున్నాయి.

 

 

ఇలాంటి టైమ్ లో రవి తేజ డిస్కో రాజా విడుదల అయితే ఈ సినిమాకి ఎవరు వస్తారనే సందేహం మొదలైంది. ఎందుకంటే ఆడియన్స్ అందరూ పండగ వాతావరణంలో సినిమాని చూడడానికి డబ్బులు ఖర్చు పెట్టేసాక మళ్ళీ సినిమాకి వచ్చే పరిస్థితి కనిపించదు. పండగ పూర్తయి పదిహేను రోజుల గ్యాప్ కూడా లేకుండా వస్తున్న డిస్కో రాజా సినిమాకి ప్రేక్షకులు ఏ మాత్రం వస్తారనేది సందేహమే...

 

 

 

ఇలాంటి పరిస్థితిలో డిస్కో రాజా సూపర్ టాక్ తెచ్చుకుంటే తప్ప జనాలు సినిమా థియేటర్లకి వచ్చే పరిస్థితి కనిపించదు. మరి రాంగ్ టైమింగ్ లో వస్తున్న డిస్కో రాజా ప్రేక్షకుల చేత మెప్పించబడతాడా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: