పండగ సీజన్ ముగిసినా, వీకెండ్ ముగిసినా అల.. వైకుంఠపురములో సినిమా హవా ఆగడం లేదు. వర్కింగ్ డేస్ లో కూడా స్పీడ్ ఫుల్స్ తో టాలీవుడ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి పరుగులు పెడుతోంది. కెరీర్ పరంగా బన్నీకి ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ ఇదే మొదటిసారి. టాలీవుడ్ లో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్మల్ డేస్ లో ఉండే క్రేజ్, స్పీడ్ ఫుల్స్ ని బట్టే ఏ సినిమా రెవెన్యూ అయినా రికార్డులైనా తెలిసేది. ఈ విషయంలో అల.. చాలా స్పీడ్ గా ఉంది.

 

 

ఇప్పటికే తెలుగులో పలు రికార్డులు క్రియేట్ చేసిన అల.. ఇప్పుడు ఓవర్సీస్ లోనూ తన హవా కొనసాగిస్తోంది. యూఎస్ మార్కెట్ లో నిన్నటితో మూడు మిలియన్ల మార్కు చేరుకున్న అల.. వైకుంఠపురములో సరికొత్త రికార్డుపై కన్నేసింది. నాన్ బాహుబలి రికార్డులపరంగా చూస్తే రంగస్థలం పేరు మీద ఉన్న 3.5 మిలియన్ల వసూళ్ల రికార్డును అతిత్వరలోనే చెరిపేసేట్టుంది అల.. వైకుంఠపురములో. లాంగ్ రన్ లో 4మిలియన్లు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బన్నీ కెరీర్ లో మూడు మిలియన్ల మార్క్ దాటిన తొలి సినిమాగా రికార్డు సృష్టిస్తోంది.

 

 

ఇప్పటికే సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఈ సినిమా టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డుతో ఉన్న రంగస్థలంపై కన్నేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. బన్నీ క్రేజ్, మెగా అభిమానుల సపోర్ట్, ఫ్యామిలీ ఆడియన్స్, యూత్.. ఇలా అన్ని వర్గాలకు చేరువైందీ ఈ సినిమా. సినిమా భారీ విజయంలో తమన్ అందించిన పాటలదే అగ్ర తాంబూలం. అందుకే రిపీట్ ఎక్కువగా పడుతున్నాయి. బన్నీ ఫెర్మార్మెన్స్, త్రివిక్రమ్ మాయాజాలం కూడా ఈ సినమాకు మేజర్ ఎస్సెట్స్.  

మరింత సమాచారం తెలుసుకోండి: