ఆయన ఏం మాట్లాడినా సంచలనమే...  ఏ ట్విట్  పెట్టిన అదొక వివాదమే.. అందరిదీ ఒక రూటు  అయితే ఆయన రూటు  మాత్రం సపరేటు... ఆయన తెరకెక్కించే సినిమాల గురించి అయితే... అబ్బో అవొక  వివాదాల పుట్ట.. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా... సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సంచలనాలు అంటే సంచలన విజయాలను నమోదు చేస్తారు అనుకునేరు.. ఒకప్పుడు సంచలన విజయాలకు సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మాత్రం సంచలన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇక వర్మ ఎప్పుడు ఎవరి మీద ఎటాక్ చేసి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో  ఎవ్వరికీ అర్థం కాదు. వర్మకు మైండ్ లో మెదిలే ఆలోచన అసలు ఊహకందని విధంగా ఉంటుంది. అందుకే వర్మ ట్వీట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అయిపోతుంది. 

 

 

 ఇక వర్మ సినిమాలు అయితే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి... కాదు కాదు వివాదాలే వర్మ సినిమాగా తీస్తూ ఉంటారు. వివాదాలు లేని సినిమా వర్మ తీసాడు అంటే... అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఇక మొన్నటికి మొన్న అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ... అంతగా ఆకట్టుకోలేకపోయాడు రామ్ గోపాల్ వర్మ. ఇకపోతే గతంలో మెగాఫ్యామిలీపై సినిమా తీస్తున్నాను అంటూ ప్రచారం చేసి ఆ తర్వాత.. మెగాఫ్యామిలీపై సినిమా తీయడం లేదని నేను చెప్పింది అంతా తూచ్ అంటూ మరో ట్వీట్ పెట్టి సంచలనం సృష్టించాడు. ఇక తాజాగా మరోసారి మెగా ఫ్యామిలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ పెట్టాడు రాంగోపాల్ వర్మ.

 

 

 మెగా కుటుంబంలో పవర్ స్టార్ అంటే అల్లు అర్జున్ మాత్రమేనని... రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు రామలింగయ్య నిజమైన వారసుడుని తానే అని అల్లు అర్జున్ నిరూపించుకున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేసిన వర్మ.... అసలు సిసలైన మెగా పవర్ స్టార్ అల్లుఅర్జున్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. సూపర్ స్టార్ గా మెగా ఫ్యాన్స్ మెప్పించే హీరో గా నిలిచింది కేవలం బన్నీ  మాత్రమేనని రాంగోపాల్ వర్మ తెలిపారు. కాగా ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రామ్ గోపాల్ వర్మ పెట్టినట్టు ట్విట్  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇప్పటికే అభిమానులందరూ మెగా పవర్ స్టార్ టాగ్ ను  రామ్ చరణ్ కు ఇచ్చిన నేపథ్యంలో వర్మ చేసిన ట్వీట్ మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: