సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు నిన్న తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల షేర్ ను రాబట్టడంతో 10రోజుల్లో ఈ చిత్రం అక్కడ 101.97 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. తద్వారా వేగంగా 100కోట్ల మార్క్ ను చేరుకున్న రెండో సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాదు బాహుబలి , బాహుబలి 2 తరువాత ఏపీ&తెలంగాణ లో 100కోట్ల వసూళ్లను రాబట్టిన మూడో సినిమా కూడా సరిలేరు నీకెవ్వరు కావడం విశేషం. ఇక ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం నెమ్మదించింది దాంతో ఇప్పటివరకు అక్కడ 2మిలియన్ డాలర్ల వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం అక్కడ బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే.
సరిలేరు 10రోజుల వసూళ్ల వివరాలు :
నైజాం -33కోట్లు
సీడెడ్ - 14.65 కోట్లు
ఉత్తరాంద్ర - 1707 కోట్లు
గుంటూరు -9.03 కోట్లు
కృష్ణా - 7.97 కోట్లు
నెల్లూరు - 3.62 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10రోజులకు గాను షేర్ = 101.97 కోట్లు