దర్శకుడు జంధ్యాల చనిపోయి రెండు దశాబ్దాలు దగ్గర పడుతున్నా ఆయన సినిమాలు ఇంకా బతికే ఉన్నాయి. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వం వహించిన ‘అహనా పెళ్ళంట’ మూవీ బుల్లితెర పై ప్రసారం అవుతున్నప్పుడు ఇప్పటికీ ఆ కామెడీ సీన్స్ ను ఎంజాయ్ చేసేవారు ఎంతోమంది ఉన్నారు.

బూతుకి - హాస్యానికి తేడా తెలియని పరిస్థితులలో ఒక మంచి హాస్య సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో తీయడానికి త్రివిక్రమ్ ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. ‘అల వైకుంఠపుములో’ సక్సస్ సంబరాల నుండి గ్యాప్ తీసుకుని వచ్చే నెల నుండి త్రివిక్రమ్ జూనియర్ తో చేయబోయే సినిమా కథ గురించి ఆలోచనలు మొదలుపెడతాడని తెలుస్తోంది.

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత జూనియర్ నటించబోయే సినిమా డిఫరెంట్ గా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీని చేయాలి అన్న ఉద్దేశ్యం తారక్ కు ఏర్పడటంతో ఇప్పుడు త్రివిక్రమ్ జూనియర్ తో తీయబోయే స్క్రిప్ట్ కు పూర్తి కామెడీ టచ్ ఇస్తున్నట్లు టాక్. జూనియర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించే ఈ మూవీకి కూడ త్రివిక్రమ్ సొంత నిర్మాత సంస్థ హారికా హాసిని సహా నిర్మాతగా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. 

‘అదుర్స్’ మూవీ తరువాత జూనియర్ హాస్యం బాగా నటించిన సినిమాలు రాలేదు. అయితే చాల కాలం తరువాత తిరిగి జూనియర్ తనలోని కామెడీ ట్రాక్ ను త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ తో తిరిగి ప్రేక్షకులకు రుచి చూపిస్తే ఆ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ అవుతుంది అన్న అంచనాలతో అడుగులు వేస్తున్నట్లు టాక్. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ సంవత్సరం మేలో ఈమూవీ షూటింగ్ కు సంబంధించిన పూజ కార్యక్రమాలు మొదలు పెట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ హడావిడి పూర్తిగా పూర్తి అయిన తరువాత ఈ ఏడాది చివరిలోగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది అని టాక్..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: