సినిమా రిలీజ్ కి ముందు నుండే ఎంతో పాజిటివ్ బజ్ తెచ్చుకున్న చిత్రం అల వైకుంఠపురములో రిలీజ్ తర్వాత కూడా పాజిటివ్ తాక్ తెచ్చుకుని బాక్సాఫీసు వద్ద దుసుకుపోతుంది. దుమ్ము రేపే కలెక్షన్లతో రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. దాదాపు సంవత్సరంన్నర తర్వాత వచ్చిన బన్నీ సినిమా అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేసి తన పేరు లిఖించుకునేందుకు సిద్ధం అవుతోంది.

 

అల వైకుంఠపురములో చిత్రానికి ప్రేక్షకుల నుండి విపరీత ఆదరణ లభిస్తుంది. మాస్, క్లాస్ అని కాకుండా అన్ని ఏరియాల నుండీ ఈ సినిమా మంచి స్పందన వస్తుంది. అయితే కలెక్షన్లు కూడా ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలతో సహా ఓవర్సీస్ లోనూ సత్తా చాటుతోంది. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నింటికీ పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ రికార్డుల పరంగా తన పేరు ముందుండేలా చూసుకుంది.

 

ఈ  చిత్రానికి యూఎస్ లో విశేష ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే బన్నీ యుఎస్ గ్రాసర్ లో అల్ టైం టాప్ ప్లేస్ కి చేరుకోగా మరిన్ని రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది.  తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం $3 మిలియన్ మార్కుని దాటివేసింది. ఫుల్ రన్ లో ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం $3.5 మిలియన్ వసూళ్లతో నాన్ బాహుబలి రికార్డ్ సొంతం చేసుకున్న చిత్రంగా ఉంది.

 

కొద్దిరోజులలో అల వైకుంఠపురంలో ఈ మార్క్ ని దాటివేసే సూచనలు కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా కనిపించగా, సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్రలో కనిపించింది. థమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాని హారికా హాసినీ క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: