నేచురల్ స్టార్ నాని హీరోయిన్స్ కి లక్కి హ్యాండ్ అంటుంటారు చాలా మంది. ఇదే విషయాన్ని హీరోయిన్స్ కూడా చెప్పుకుంటుంటారు. వాళ్ళలో నివేదా థామస్ ముందుంటుంది. నాని కూడా తన పక్కన నటించిన హీరోయిన్స్ కి గట్టిగానే సపోర్ట్ చేస్తుంటాడు. ఇక ఈయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ బ్యూటి మెహ్రీన్ ఆ సక్సస్ తర్వాత వరుసగా తెలుగు, తమిళంలో చాలా సినిమాల్లో నటించింది. కాని అన్ని సినిమాలు చేసినప్పటికి ఈ బ్యూటీ అకౌంట్ లో పట్టు మని పది సూపర్ హిట్ సినిమాలు లేకపోవడం ఆశ్చర్యకరం. ఇంకా చెప్పాలంటే తెలుగులో మెహ్రీన్ కి బాగా బ్యాడ్ టైం నడుస్తోంది. తను చేసిన సినిమాలు అంతగా సక్సస్ ని ఇవ్వడం లేదు. చేసిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ గానే మిగులుతుంది. ఒకవేళ సినిమా సక్సెస్ అయినా కూడా ఆ క్రెడిట్ హీరోకో లేక ఇంకో హీరోయిన్ కో వెళ్ళిపోతోంది.

 

గత ఏడాది ఎఫ్ 2 సినిమాతో సక్సెస్ ను దక్కించుకున్న మెహ్రీన్ కు ఆ సక్సెస్ పెద్దగా ఉపయోగపడింది లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆ సక్సస్ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్న, దర్శకుడు అనిల్ రావిపూడి, ఆఖరికి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా తలా కాస్త పంచుకున్నారు తప్ప పాపం మెహ్రీన్ కి ఇచ్చిందేమి లేదు. ఇక గత ఏడాది ఎఫ్ 2తో పాటు చాణక్య సినిమాలో కూడా నటించింది. గోపీచంద్ నటించిన ఈ సినిమా కూడా డిజాస్టర్ అయి మెహ్రీన్ ను బాగా డిసప్పాయింట్ చేసింది. తాజాగా మెహ్రీన్ కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ఎంత మంచి వాడవురా సినిమా కూడా నిరాశనే మిగిల్చింది.

 

మెహ్రీన్ మొదటి సినిమా సమయంలో జూనియర్ మిల్కీ బ్యూటీ అంటూ ప్రశంసలు అందుకుంది. స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంటుందని ఇండస్ట్రీలో చాలామంది అనుకున్నారు. కాని వాళ్ళందరి అంచనాలు తారుమారు అయ్యాయి. తెలుగులో మెహ్రీన్ అసలు లక్ కలిసి రావడం లేదు. తమిళంలో ఇటీవల ధనుష్ తో పటాస్ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా మెహ్రీన్ కు గొప్ప పేరు ఏమీ తెచ్చి పెట్టలేదు. సీనియర్ హీరోయిన్ అయిన స్నేహ గురించే అందరు మాట్లాడుకుంటున్నారు తప్ప మెహ్రీన్ ని ఎవరు పట్టించుకోవడం లేదు. పేరుకి తెలుగు.. తమిళం.. పంజాబీ సినిమాలు చేస్తున్నప్పటికి సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఇక ఎంత మంచివాడవురా ఫ్లాపవడం తో 2019 స్టార్టింగే మంచి సక్సస్ ఇస్తే 2020 మాత్రం ఎంత మంచివాడవురా ఫ్లాప్ అయి కాస్తో కూస్తో ఉన్న క్రేజ్ ని 2020 తీసుకెళ్ళిందని తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని ఫీలవుతుందట మెహ్రీన్.  

మరింత సమాచారం తెలుసుకోండి: