టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. తొలిసారిగా మెగా, నందమూరి హీరోలైన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రాత్మక సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ విప్లవ యోధుడు కొమరం భీం గా నటిస్తుండగా, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్, రామ్ చరణ్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్ర ఖని ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాని ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ లో నేడు పాల్గొనబోతున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కు సంబందించిన ఒక పోస్ట్ ని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. 'మీ కోసం మా టీమ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది, మా అందరి తరపున మీకు ఇదే ఆహ్వానం' అంటూ అజయ్ దేవగన్ తో కలిసి దర్శకుడు రాజమౌళి దిగిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసారు. అయితే ఈ సినిమాలో అజయ్ ఎటువంటి పాత్రలో నటిస్తున్నారు అనే దానిపై మాత్రం సమాచారం లేదు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్

 

హాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండడంతో సినిమాపై రోజురోజుకు అంచనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమాలో విలన్స్ గా నటిస్తున్న హాలీవుడ్ నటులైన స్కాట్, లేడీ స్కాట్ పాత్రలను ప్రకటించి సినిమాపై మంచి క్రేజ్ తీసుకువచ్చారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని జులై 30 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ మారిందంటూ కొద్దిరోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నప్పటికీ, ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం ఇప్పటివరకు వాటిపై స్పందించలేదు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: