భానుమతి, సావిత్రి, జమున కాలంలో ఉండే పద్దతులే వేరేగా ఉండేవి. షూటింగ్ ఉంటే ఉదయాన్నే సెట్ కి వచ్చేవాళ్ళు. లేదంటే ఇంట్లో వాళ్ళతో గడిపే వాళ్ళు. కానీ నేటి తరం హీరోయిన్స్ మాత్రం లేవగానే ఫిట్ నెస్ జిం సెంటర్స్ లో దూరిపోతున్నారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కియారా అద్వాని, పూజా హెగ్డే, శృతిహాసన్ .. వీళ్ళే కాదు ఒక బిడ్డకి తల్లైన కరీనా కపూర్ కూడా బాడి షేప్ కోసం ఫిట్ గా కనిపించడం కోసం రోజులో కొన్ని గంటలు ఫిట్ నెస్ కోసం చెమటలు కక్కిస్తున్నారు. బరువులను మోస్తూ ఒంట్లోని కొవ్వును కరగ దీస్తున్నారు.

 

అయితే కొంతమంది బక్క పలచగా ఉన్నా ఇలా ఫిట్ నెస్ అంటూ ఎందుకు వయ్యారాలు పోతారో అర్థం కాదు. ఒంట్లో ఉన్న ఎముకలను కరగదీస్తారో ఏమో మరి. ఇక్కడ మన రష్మికని చూస్తే అదే అనిపిస్తుంది ..అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవంగా సమంత, రకుల్, పూజా హెగ్డే కూడా జిం చేసి ఒళ్ళు తగ్గించుకోవాల్సిన పర్సనాలిటి ఏమీ ఉండదు. అయినా వీళ్ళు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికి రోజు కొన్ని గంటలు జిం లో గడుపుతున్నారు. సమంత అయితే ఏకంగా 100 కేజీల బరువును లేపి అందరికి షాకిచ్చింది.

 

ఇప్పుడు ఈ లిస్ట్ లో కన్నడ బ్యూటి రష్మిక మందన్న పేరు చేరింది. వీళ్ళలాగానే రష్మిక మందన ఫిట్‌నెస్ అంటూ బయలు దేరింది. ఛలో- గీతగోవిందం- సరిలేరు నీకెవ్వరు సినిమాలతో ఇప్పుడు రష్మిక రేంజ్ టాలీవుడ్ లో బాగా పెరిగింది. హీరోయిన్ ఎలా ఉన్నా మన దగ్గర సక్సస్ కే ఇంపార్టెన్స్. అందుకే రష్మిక ఇప్పుడు లక్కీ హీరోయిన్. పూజా హెగ్డే తర్వాత అందరికి నెక్స్ట్ ఛాయిస్ రష్మిక నే కనిపిస్తోంది. దాంతో ఈ కన్నడ బ్యూటి రెమ్యూనరేషన్ విషయంలోను మేకర్స్ దగ్గర బాగా డిమాండ్ చేస్తోందట. అంతేకాదు ఎలాగైనా ఇంకా అందంగా, ఫిట్ గా తయారవ్వాలని బాలీవుడ్ లో ఛాన్సులు దక్కించుకోవాలని ఫిట్‌నెస్ మీద ఫోకస్ చేస్తోందట.


 
టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి కేవలం మూడు నాలుగేళ్ల కే స్టార్ స్టాటస్ వచ్చిందని రష్మిక అనుకుంటుందట. ప్రస్తుతం తనకున్న పాపులారిటీని ఇంకా పెంచుకోవాలనే ఆరాటంలో ఉందని చెప్పుకుంటున్నారు. అందుకే ఇలా ఫిట్ నెస్ పైనే ప్రత్యేకంగా శ్రద్ద పెట్టిందిట. జిమ్ములో ఎక్కువ సమయం గడుపుతు సమంత.. రకుల్ రేంజ్ గ్లామర్స్ నాది కూడా అని ప్రూవ్ చేస్తుందట. తాజాగా రష్మిక జిమ్మింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైలర్ అవుతోంది. ఇక ప్రస్తుతం నితిన్ సరసన భీష్మ సినిమాలో రష్మిక నటిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా షూటింగ్ లోనూ రష్మికనే హీరోయిన్. అయితే రష్మిక జిమ్మింగ్ వీడియో చూసిన నెటిజెన్స్ మాత్రం జాగ్రత్త రష్మిక ఫిట్‌నెస్ అంటూ ఇంకా పీక్కుపోయోవు .. ఇప్పటికే మేకప్ లేకపోతే చూడలేకపోతున్నాం ..! అంటూ కామెంట్స్ చేస్తున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: