ప్రపంచంలో మనుషులను ఏకం చేసే శక్తి సంగీతానికి ఉంటుంది.  సంగీతానికి రాళ్ళ సైతం కరిగిపోతాయి అని పూర్వికులు చెప్తుండేవారు.  ఇది ముమ్మాటికీ నిజం అని మరోసారి నిరూపణ జరిగింది.  2020లో సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఒకటి అల వైకుంఠపురంలో సినిమా.  ఈ సినిమాలోని సామజవరగమన సాంగ్ ఇంతపెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు.  వంద మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని రికార్డ్ దిశగా పరుగులు తీస్తున్నది.  


ఇప్పుడు ఎవరినోట విన్నా ఇదే సాంగ్.  అందుకే సాంగ్ ఆఫ్ ది ఇయర్, సాంగ్ ఆఫ్ ది డికేడ్ అనిపించుకుంది.  ఈ సాంగ్ కోసం థమన్ చాలా కష్టపడ్డారు.  సాంగ్ కు ప్రాణం పోశారు.  ఈ సాంగ్ ఒక్క మనదేశంలోనే కాదు, మన శత్రుదేశమైన పాకిస్తాన్ లో కూడా ఈ సాంగ్ ఫీవర్ మొదలైంది.  అక్కడి యువత ఈ సాంగ్ ను విపరీతంగా పాడుకుంటోంది.  వాళ్లకు ఈ ట్యూన్ పిచ్చ పిచ్చాగా నచ్చిందట.  పదేపదే వింటూ హమ్ చేస్తున్నారు.  


సోషల్ మీడియాలో ఈ సాంగ్ కోసం వెతుకుతున్నారు.  తెలుగులో కాకుండా బన్నీకి మలయాళంలో మంచి పేరు ఉన్నది.  అయన సినిమాలో మలయాళంలో బాగా ఆడుతుంటాయి.  ఈ సాంగ్ తో బన్నీ పాకిస్తాన్ లో కూడా ఫేమ్ అవుతాడు అందంలో సందేహం అవసరం లేదు.  పాక్ లో అల్లు అర్జున్ సినిమాలు రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.  ఇందుకు కారణం థమన్ ట్యూన్ అని చెప్పాలి.  


థమన్ అందించిన ఈ ట్యూన్ చాలా కొత్తగా ఉండటంతో పాటుగా ఆకట్టుకునే విధంగా క్యాచీగా ఉన్నది.  ఈ ట్యూన్ తరువాత లిరిక్స్ అందించిన సీతారామశాస్త్రి, పాడిన సిద్ శ్రీరామ్ కు కూడా మంచి పేరు తీసుకొచ్చింది.  ఇలాంటి సాంగ్స్ మరలా మరలా రావు.  ఒకవేళ సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటె ఇలాంటి సాంగ్స్ తప్పకుండా వస్తాయి అనడంలో సందేహం అవసరం లేదు.  ఇదిలా ఉంటె, ఈ సాంగ్ కేటీఆర్ కు కూడా బాగా నచ్చింది.  దావోస్ మీటింగ్ కోసం వెళ్లిన కేటీఆర్ ఈ సాంగ్ ను వింటూ ఎంజాయ్ చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: