పండుగ సందడిని రెట్టింపు చేస్తూ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ కు మంచి ఊపు తెచ్చింది. చాలా కాలం తర్వాత మహేశ్ బాబు ఆల్ రౌండర్ పర్ఫామెన్స్ తో అలరించాడు. కామెడీ, ఫైట్స్, డాన్స్ లతో పాటు ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. మహేశ్ బాబు ఆల్ రౌండర్ పర్ఫామెన్స్ సరిలేరు నీకెవ్వరు సినిమాను నిలబెట్టింది. 

 

పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు మాస్ లోకి దూసుకెళ్లింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఫోర్స్డ్ కామెడీ.. వర్కవుట్ అయింది. ట్రైన్ కామెడీ ఎపిసోడ్, బ్యాంగ్, క్లైమాక్స్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఇక రష్మిక అండ్ కో కామెడీ, విజయశాంతి అప్పీరియన్స్, ప్రకాశ్ రాజ్ పాత్ర కూడా సినిమాకు బాగా కలిసొచ్చింది. 

 

వరల్డ్ వైడ్ గా 103కోట్ల బిజినెస్ చేసిన సరిలేరు నీకెవ్వరు ఆల్ ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చింది. సరిలేరు నీకెవ్వరు ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజులకు గాను 108 గ్లాస్ తో 62కోట్ల షేర్ దక్కించుకుంది. ఓవర్సీస్ లో కాస్త నెమ్మదిగా కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమా మరో వారానికి లాభాల బాట పడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 


నైజాంలో 18కోట్ల బిజినెస్ చేసిన సరిలేరు నీకెవ్వరు ఆరు రోజుల్లో 12కోట్లు రాబట్టింది. సీడెడ్ లో 8కోట్లకు గాను 6కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ లో 11కోట్లకు అమ్ముడు పోయిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఆరు రోజుల్లో ఆరున్నర కోట్లతో సేఫ్ సైడ్ గా వెళుతోంది. పైనల్ రన్ ముగిసేసరికి సరిలేరు నీకెవ్వరు మంచి లాభాలతో డీసెంట్ హిట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.  మొత్తానికి మహేశ్ బాబు ఆల్ రౌండర్ పర్ఫామెన్స్ సరిలేరు నీకెవ్వరు సినిమాను నిలబెట్టింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: