సంక్రాంతి సీజన్ లో చివరగా ఎంత మంచివాడవురా సినిమాతో కళ్యాణ్ రామ్ బాక్సాఫీస్ వద్ద తన అదృష్టం పరీక్షించుకున్నాడు. పండుగ వాతావరణానికి సరిపోయే కథతో వచ్చిన ఎంత మంచివాడవురా సినిమా తొలిరోజు డిసెంట్ వసూళ్లను దక్కించుకుంది. మూడేళ్ల కిందట చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాల మధ్యలో శతమానం భవతి సినిమాతో సతీష్ వేగ్నశ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశాడు. ఈ సారి కూడా అలాంటి టఫ్ కాంపిటీషన్ లో కళ్యాణ్ రామ్ తో సేమ్ మ్యాజిక్ రిపీట్ చేయాలని సంక్రాంతి బరిలో దిగాడు. కానీ శతమానం భవతిలో ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంత మంచివాడవురా సినిమాలో మిస్ మ్యాచ్ కావడంతో ఫలితం తేడా కొట్టింది. 

 

మాస్ మూవీస్ చేసే కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైం ఎంత మంచివాడవురా సినిమాలో క్లాస్ క్యారెక్టర్ లో నటించాడు. ఈ నందమూరి హీరో తనవంతు పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ కథలో భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలించకపోవడంతో బాక్సాఫీసు వద్ద ఎంతమంచి వాడవురా సక్సెస్ ట్రాక్ తప్పింది. ఎమోషన్స్ సప్లై అనే కాన్సెప్ట్  సిల్లీగా ఉండటంతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. 

 

లాస్ట్ ఇయర్ 118తో కళ్యాణ్ రామ్ మంచి విజయం అందుకున్నాడు. ఈ సారి పండుగ బరిలో ఎంత మంచివాడవురా సినిమాతో మరో సక్సెస్ కంటిన్యూ చేయాలనుకున్నాడు. కానీ సతీష్ వేగ్నేశ ఎంచుకున్న పాయింట్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అయితే పదికోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఎంత మంచివాడవురా టాక్ తో సంబంధం లేకుండా తొలి రోజు రెండున్నర కోట్లు రాబట్టింది. మరి ఈ మూవీ సేఫ్ జోన్ లోకి వెళుతుందో లేదో చూడాలి. కళ్యాణ్ రామ్ కష్టం ఏమీ వృథాగా పోలేదు. నందమూరి అభిమానులు మాత్రం థియేటర్స్ కు వెళ్లి సినిమా చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: