బాలకృష్ణ, బోయపాటి సినిమా నందమూరి ఫ్యాన్స్ లో హుషారు నింపింది. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు..? రిలీజ్ డేట్ గురించి ఆలోచించడం లేదు. అంతకంటే ముందే.. వచ్చే బాలయ్య లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రతిసారి బాలయ్యను డిఫరెంట్ గా చూపించే బోయపాటి ఈ సారి ఎలా చూపిస్తాడన్న ఎగ్జయిట్ మెంట్ అందరిలో ఉంది. 

 

బాలకృష్ణ ఏంటి?  గుండుతో కనిపిస్తున్నాడు అనుకుంటున్నారా..?  బోయపాటి సినిమా కోసం.. మేక్ ఓవర్ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇలా కనిపిస్తున్నాడు గానీ.. ఫైనల్ గా ఎలాంటి లుక్ తీసుకొస్తారో చూడాలి. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ సింహాతో మొదలైంది. సింహాగా.. మీసాలు గుబురుగా పెంచి ఆకట్టుకున్న బాలయ్య లెజెండ్ గా మరోసారి డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ఇలా రెండు సినిమాల్లో రెండు రకాలుగా కనిపించిన బాలయ్య మూడో సినిమా కోసం ఎలా మారతారో చూడాలి. 

 

బాలకృష్ణ, బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే మొదలు కావాల్సి ఉన్నా.. పకడ్బందీ స్క్రిప్ట్ వర్క్ కోసం బోయపాటి టైమ్ తీసుకున్నాడు. దీంతో సినిమా ముందుగా అనుకున్నట్టు మేలో రిలీజ్ అయ్యే అవకాశం లేదని సమాచారం. కథానాయకుడు.. మహానాయకుడు.. రూలర్ లాంటి హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో.. బాలయ్య ఈ సారి స్క్రిప్ట్ వర్క్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో సినిమా రెగ్యులర్ షూటింగ్ లేటవుతోంది. మరోవైపు ట్రిపుల్ ఆర్ వాయిదా బాలకృష్ణ సినిమాకు కలిసి రానుంది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవ్వాల్సిన జులై 30న బాలకృష్ణ బోయపాటి సినిమా విడుదలయ్యే అవకాశం ముంది. ఇంకేముంది నందమూరి ఫ్యాన్స్ లో ఒకింత ఆశలు చెలరేగాయి. తమ అభిమాన నటుడు కొత్త సినిమాలో ఎలా నటించబోతున్నాడు.. డైలాగులు ఉండబోతున్నాయనే ఉత్కంఠ వారిలో నెలకొంది. బాలయ్యను బోయపాటి ఈ సారి ఎలా చూపిస్తాడన్న ఎగ్జయిట్ మెంట్ అందరిలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: