సరదాగా గడపాలని అందరికి ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయాల్లో ఈ ప్రైవసీ అనేది చాలా ముఖ్యమైనది. అందరిలా ఎంజాయ్ చేయాలనుకున్న వారికున్న పరిధిలో మాత్రమే వారు తమ జీవితాలను అనుభవిస్తారు. లేదా వారిని గుర్తుపట్టని చోటుకు వెళ్లి ఆనందంగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇక ఈ మధ్యకాలంలో మన తెలుగు హీరోలల్లో కొందరికి హాలీవుడ్ హీరోల పోలికలు కనిపిస్తున్నాయి. వీరికి మెకప్ వేస్తే అచ్చం హాలీవుడ్ హీరోల్లానే కనిపిస్తారు.

 

 

ఇదే కాకుండా ఇప్పుడున్న హైటెక్నాలజీ సెల్ ఫోన్లల్లో వస్తున్న కొత్త కొత్త యాప్‌లతో మనం భవిష్యత్తులో వృద్ధులుగా మారిన తర్వాత ఎలా ఉంటాం, అదే కాస్త వయస్సును తగ్గిస్తే ఎలా ఉంటాం అనే విధంగా ఫేస్ యాప్‌లో రకరకాలుగా మేకప్ చేసుకుని ఇప్పుడున్న ముఖానికంటే భిన్నంగా కనిపించేలా మార్ఫింగ్ చేసి సరదాగా తన స్నేహితులకు, పంపుకుంటారు కొందరు. దీనికి సెలబ్రిటీలు కూడా మినహాయింపేమి కాదు. వారు కూడా అప్పుడప్పుడు తమ అభిమానులను ఆట పట్టిస్తుంటారు. ఇలా మార్ఫింగ్ చేసిన ఫోటోల్లో ఉన్న టాలీవుడ్, బాలీవుడ్ హీరోలను గుర్తు పడతాం..  కాని హాలీవుడ్ హీరోల గురించి పెద్దగా అవగహాన లేదంటారు. ఇదిగో ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ ఇక్కడ ఎదురైంది.

 

 

అదేమంటే ఒక్క సారి పైన ఉన్న ఫోటోలోని ముఖాలు చూడగానే గుర్తుపట్టండి. పట్టేసారా వారెవరో..  చూస్తుంటే ఇవేవో కొత్త ముఖాలు ఉన్నట్లుగా అనిపిస్తున్నాయా, లేక హాలీవుడ్ హీరోల్లా కనిపిస్తున్నారా.. అయితే మీరు పొరబాటు పడ్డట్లే. ఎందుకంటే అచ్చం హాలివుడ్ హీరోల్లా ఉన్న వీరు, మన టాలీవుడ్ హీరోలే. నిన్న మెగా హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా పేస్ యాప్ ద్వారా రామ్ చరణ్, వరుణ్ కలిసి దిగిన ఫోటోను ఇలా మార్చేశారు.

 

 

హాలీవుడ్ హీరోల్లా .. ఓల్డ్ ఏజ్ తో ఆకట్టుకునేలా ఉన్న ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వరుణ్ పుట్టిన రోజు సందర్బంగా చరణ్ గ్రీటింగ్ తెలుపుతూ ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. అంతే కాకుండా వయసు మళ్లుతుండడాన్ని ఆస్వాదించు .. వరుణ్ అంటూ కామెంట్ కూడా పెట్టాడు.. ఇలా విచిత్రంగా కూడా విషెష్ చెప్పవచ్చని చెర్రీ దీనితో నిరూపించాడని, మెగా అభిమానులు అనుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: