ఈ మద్య టాలీవుడ్ లో వస్తున్న మూవీస్ ఇంట గెలిచి రచ్చ గెలవాలని సామెతకు బదులు.. రచ్చ గెలిచి ఇంట గెలుస్తున్నారు.  అంటే ఓవర్సీస్ లో సత్తా చాటుతూ.. ఇక్కడ కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతున్నారు.  స్టార్ హీరోల సినిమాలు కూడా బారీ బడ్టెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  అయితే కొన్ని సార్లు ఫ్లాప్ టాక్ వచ్చినా.. ఓవర్సీస్ లో మాత్రం పరవాలేదు అనిపించేలా ఉంటున్నాయి.  ఇటీవల సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మూవీస్ సైరా, సాహెూ తెలుగు నాట మిశ్రమ స్పందన వచ్చినా.. ఓవర్సీస్ లో మాత్రం మంచి స్థానం దక్కించుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’  2.83 మిలియన్ డాలర్లు ,  ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహెూ’3.23 మిలియన్ డాలర్లు  రాబట్టాయి.  

 

తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో రిలీజ్ అవుతున్నాయి.  తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాల తరువాత మంచి మార్కెట్ ఓవర్సీస్ అని చెప్పాలి.  అక్కడ బాహుబలి 2 సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.  ఈ సినిమాపై రాజమౌళి, ప్రభాస్ పెట్టుకున్న నమ్మకాలు వమ్ము కాలేదని చెప్పాలి.  ముఖ్యంగా బాహుబలి, బాహుబలి 2 మూవీస్ టాలీవుడ్ కీర్తిని ఎక్కడికో తీసుకు వెళ్లాయి.  అప్పటి నుంచి స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నారు దర్శక, నిర్మాతలు.  

 

బాహుబలి రెండు సినిమాలు విదేశాల్లో టాప్ విజయం సాధించింది. అయితే ఈ మద్య తక్కువ పెట్టుబడి పెట్టిన మూవీస్.. చిన్న హీరోల సినిమాలు సైతం ఓవర్సీస్ లో మంచి హిట్ అందుకోవడమే కాదు.. కలెక్షన్లు కూడా భారీగానే రాబడుతున్నాయి.  గీతా గోవిందం,  మహానటి సినిమాలకు మంచి పేరు.. కలెక్షన్లు వచ్చాయి.  మరి యూఎస్ లో మంచి విజయం సొంతం చేసుకున్న టాప్ 10 సినిమాలు ఏంటో చూద్దాం. 


గీత గోవిందం -  2.46 మిలియన్ డాలర్లు 

మహానటి - 2.54 మిలియన్ డాలర్లు 

సైరా - 2.83 మిలియన్ డాలర్లు 

శ్రీమంతుడు - 2.89 మిలియన్ డాలర్లు 

అల వైకుంఠపురంలో - 3.05 మిలియన్ డాలర్లు 

సాహో - 3.23 మిలియన్ డాలర్లు 

భరత్ అనే నేను - 3. 41 మిలియన్ డాలర్లు 

రంగస్థలం - 3.51 మిలియన్ డాలర్లు 

బాహుబలి - 8.46 మిలియన్ డాలర్లు 

బాహుబలి 2 - 21 మిలియన్ డాలర్లు  

మరింత సమాచారం తెలుసుకోండి: