టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన  ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్.  ఈ మూవీలో మెహ్రీన్ ఎంతో అందంగా ఉండమే కాదు.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. అయితే మొదటి సినిమా మంచి హిట్ కావడంతో.. ఈ అమ్మడు టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా నిలదొక్కుకుంటుందని అందరూ భావించారు.  ఇక  మెహ్రీన్ కు వరుస సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ అనుకున్నంత సక్సెస్ మాత్రం రాలేదు. ఆమెతో వచ్చిన కీర్తి సురేష్, సాయి పల్లవి ఇతర కొంత మంది హీరోయిన్లు మంచి సక్సెస్ అందుకొని ముందుకు సాగుతున్నారు. గత ఏడాది సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్  మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2 ’ సినిమాలో మెహ్రీన్ నటించిన సంగతి తెలిసిందే.

 

సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నప్పటికీ మెహ్రీన్ కు ఎలాంటి లాభం లేకపోయింది. కానీ ఈ మూవీ తమన్నా, మెహ్రీన్ కి పెద్దగా కలిసి రాలేదు. తాజాగా సంక్రాంతి బరిలో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎంత మంచివాడవురా. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ నటించింది.  అయితే ఈ మూవీ డిజాస్టర్ టాక్ రావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న మెహ్రీన్ కి నిరాశే మిగిలిపోయింది.  అందం, అభినయం ఉన్నా మెహ్రీన్ కి అదృష్టం కలిసి రావడం లేదు. 

 

తన సహనటి కన్నడ బ్యూటీ రష్మిక మందనకు వరుస విజయాలు వరిస్తున్న విషయం తెలిసిందే.  ఒక్క తెలుగులోనే కాదు తమిళ్, పంజాబీ లో కూడా చిత్రాలు చేస్తున్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసిరావట్లేదు. ఒక్క హిట్ తనకు వస్తే తానేంటో నిరూపించుకుంటానని అంటుంది ఈ ముద్దుగుమ్మ.  వరుస ఫ్లాప్ లు మూటగట్టుకున్న మెహ్రీన్ పని ఇక అయిపోయిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: